వరంగల్

రోడ్ల పక్కన మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 25: హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు, రోడ్లు, భవనాల, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రోడ్లపక్కన భారీగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. గత ఏడాది చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన టేకుమొక్కల ద్వారా మంచి ఫలితాలు లభిస్తున్న కారణంగా రైతులు ఈ మొక్కలు పెంచేందుకు ముందుకు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పెద్దఎత్తున టేకుమొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం రూరల్ కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో హరితహారం కార్యక్రమంపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రోడ్లపక్కన మొక్కలు నాటే కార్యక్రమానకి సంబంధించి అటవీశాఖ మిగతా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. జిల్లాలో 92.45లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని, లక్ష్యాన్ని అధిగమించేలా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. హరితహారం కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు జరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లాపరిషత్ సిఇఓ విజయగోపాల్, డిఆర్‌డిఏ ప్రాజెక్టు అధికారి శేఖర్‌రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.