వరంగల్

భర్తే కాలయముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 25: జీవితాంతం కలిసి ఉండాలనే ఆలోచనతో మూడుముళ్లు వేసిన భర్తే కాలయముడైతే కట్టుకున్న భార్యకు రక్షణ ఎక్కడనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది. మండలంలోని శివునిపల్లిలో ముస్లిం కులానికి చెందిన రహీతాబేగం (35)ను కట్టుకున్న భర్త రఫీక్ గొంతునులిమి నిర్ధాక్షిణ్యంగా హత్య చేసిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రాయపర్తి మండలానికి చెందిన రఫీక్ గత కొన్ని సంవత్సరాలుగా శివునిపల్లిలో భార్యతో సహా నివాసం ఉంటున్నట్లు వారు తెలిపారు. మద్యానికి బానిసైన భర్త రఫీక్ అప్పటి నుండి ప్రతిరోజు ఇంటికి రాగానే భార్యతో గొడువపడేవాడని తెలిపారు. రోజులు గడుస్తున్నప్పటికీ మృతురాలి భర్త రఫీక్‌లో మార్పు రాకపోవడంతో ఇంటికి వచ్చిన భర్తను నిలదీయడంతో ఆవేశానికి గురైన రఫీక్ భార్య గొంతునులిమి నెట్టివేయగా ముందు దర్వాజ కడపపై పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంఘటనా సమాచారాన్ని అందుకున్న జనగామ డిసిపి వెంకన్న మృతురాలి ఇంటిని సందర్శించారు. సంఘటనా జరిగిన విషయాలను మృతురాలి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లి జుబేదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక సిఐ కిషన్ తెలిపారు.