వరంగల్

ఆన్‌లైన్‌లో ఐసిడిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 25: జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించే పనులను ఆన్‌లైన్ చేయాలని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో స్ర్తి, శిశుసంక్షేమ శాఖ, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా నిర్వహించే పనులలో పారదర్శకత పాటించాలని, మహిళలకు, శిశువులకు ప్రయోజనం కలిగించేలా పథకాలు అమలు చేయాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య, గర్బిణీ మహిళలకు ఇస్తున్న పోషకాహారం తదితర విషయాలను కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీల పనితీరు పారదర్శకంగా, సమర్ధవంతంగా జరగాలని, అవసరమైన వివరాలు ఎప్పటికపుడు లభించేలా ఆన్‌లైన్ చేయాలని చెప్పారు. వరంగల్ నగరంలో, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో అనాథ పిల్లలు ఉన్నట్లు గమనిస్తే వెంటనే టోల్‌ఫ్రీం నంబరు 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని స్ర్తి, శిశుసంక్షేమ అధికారులకు సూచించారు. అనాథపిల్లలకు సంబంధించిన సమాచారం ఇస్తే రెస్క్యూ టీం సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి వారిని శిశుగృహాలకు, బాల, బాలికల సదనాలకు తరలిస్తారని చెప్పారు.
మొక్కల పెంపకానికి నర్సరీలను గుర్తించాలి
కాగా హరితహారం కార్యక్రమం నిర్వహించిన సమావేశంలో వరంగల్ నగరంతోపాటు అర్బన్ జిల్లా పరిధిలోని మండలాల్లో భారీగా మొక్కలు నాటే కార్యక్రమానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీలను గుర్తించాలని కలెక్టర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నాటిన మొక్కలను సంరక్షించటంతోపాటు వచ్చే సీజన్‌లో కొత్తగా సుమారు కోటి మొక్కలు నాటేందుకు అవసరమైన నర్సరీల ఏర్పాటుకు అటవీ, డిఆర్‌డిఎ, హార్టికల్చర్, సెరికల్చర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా అధికారులు నర్సరీల ఏర్పాటుకు, మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, అటవీ శాఖ అధికారి భీమానాయక్, డిఆర్‌డిఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.