వరంగల్

లైన్ ఫుల్.. క్యాష్ ‘నిల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు జరిగి మూడువారాలు గడచిన వరంగల్ నగరంలో కొత్తనోట్ల కోసం ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. ఏ బ్యాంకుకు వెళ్లినా డబ్బు లేదంటూ సమాధానం రావటం ఖాతాదారులకు ఇబ్బందికరంగా మారింది. గురువారం ఉదయం ఒకటి రెండు, బ్యాంకుల చెందిన శాఖలలో మినహా చాలా బ్యాంకులలో అందుబాటులో ఉన్నంత వరకు డబ్బు ఖాతాదారులకు అందచేసి ఆ తరువాత నో క్యాష్ అంటు బోర్డులు వేలాడదీసి కౌంటర్లు మూసివేసారు. రిజర్వ్ బ్యాంకు కొత్తగా విడుదల చేసిన ఐదువందల రూపాయల నోట్లను బ్యాంకులు గురువారం ఖాతాదారులకు అందచేసాయి. కొత్తనోట్లను చూసి యువతీ, యువకులు సంబురపడటం కనిపించింది. గురువారం ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల రూపాయల నగదు చెల్లిస్తారని మొదట్లో ప్రచారం జరిగినా, తీరా బుధవారం రాత్రి పదివేల రూపాయల నగదు చెల్లింపులకు రిజర్వ్ బ్యాకు అంగీకరించటం లేదని, బ్యాంకు ఖాతాలలోనే వేతనాలు వేస్తామని వివిధ శాఖల నుంచి సమాచారం రావటంతో ఉద్యోగ వర్గాలు నిరాశకు గురయ్యాయి. గురువారం సాయంత్రం వరకు కూడా వారివారి ఖాతాలలో కూడా వేతనాల డబ్బులు వేయకపోవటంతో బ్యాంకు నుంచి వచ్చే ఎస్సెమ్మెస్‌ల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకులలో ఎదురుచూపులు చూడవలసి వచ్చింది. కానీ సాయంత్రం వరకు వారి ఖాతాలలో డబ్బులు పడకపోవటంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు.

ఇంటింటికీ శుద్ధ జలాలు
చారిత్రక నిర్ణయం
ముందగా జనగామ జిల్లాలో కావడం అభినందనీయం * జనగామ కలెక్టర్ శ్రీదేవసేన
బచ్చన్నపేట, డిసెంబర్ 1: ఇంటింటికి గోదావరి తాగునీటి శుద్ది జలాలు అందించడం చారిత్రక నిర్ణయమని జిల్లా కలెక్టర్ దేవాసేన అన్నారు. ఆకార్యక్రమం మన జనగామ జిల్లాలోనుంచి ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. గురువారం మండలకేంద్రం బచ్చన్నపేట మిషన్ భగీరత తాగునీటి నల్లాలు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో ప్రారంభించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహ ఆవరణలో సర్పంచ్ నల్లగోని పుష్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్య మత్రి నియోజవర్గంలో కంటే ఎక్కువ ఆవాసాల్లో ఇంటింటికి శుద్దిచేసి తాగునీరు మనకు అందుతుందన్నారు. వచ్చే మార్చి చివరినాటికి నినియోజవర్గంలో అన్ని గ్రామాలకు తాగునీరు ఇంటింటికి అందనుందన్నారు. ప్రస్తుతం 120 ఆవాసలకు తాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. నీరు మినరల్‌వాటర్ కంటే మిన్నగా ఉంటాయని పూర్తిగా శుద్దిచేసిన గోదావరి నీళ్ల అన్నారు. ఇంటింటికి అందుతున్న శుద్దచేసిన తాగునీరు అందుతున్నట్లుగానే అన్ని గ్రామాల్లోని ప్రజలు ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకొని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకోసం ఎదురు చూడకుండా ముందుగా స్వంత డబ్బుతో నిర్మించుకోవాలని అన్నారు. అలస్యమైనాకూడ ప్రభుత్వం నుంచి రూ. 12వేలు అందతాయని పేర్కొన్నారు. అదే విధంగా పెద్దనోట్ల రద్దుతో ప్రస్తుతం సామాన్యులకు ఎదురువుతున్న ఇబ్బందులకు అధికమించడానికి ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలు, ఎటిఎం కార్డలు తీసుకోవాలని సూచించారు. నగదు రహిత లావాదేవీల జిల్లాగా తీర్చి దిద్దడానికి అందరు సహకరించాలని పిలుపునిచ్చారు. వివిధ వ్యాపార సంస్థలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి స్ఫైప్ మిషన్ ఏర్పాటు చేసుకునేలా సూచిస్తామని చెప్పారు. ఇందుకు జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మహేష్, వైస్ ఎంపిపి మల్లారెడ్డి, ఎంపిటిసి సభ్యులు బొమ్మెన అరుణ, ఎంపిడివొ అనిత, నాయకులు చంద్రారెడ్డి,బాలకిషన్‌గౌడ్, అంజనేయులుగౌడ్, , బాలసిద్దులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు

మహబూబాబాద్, డిసెంబర్ 1: శాంతిభద్రల దృశ్య మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మురళీధర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలోని బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌లో గురువారం బాంబుస్కాడ్ తనిఖీలు నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు, బ్యాగులు, ఇతర వస్తువులు కనిపించినచో దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్‌కు గాని, 100నెంబరుకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. అపరిచిత వ్యక్తులు ఎవరు కనిపించినా వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా పిపుల్స్ గెరిల్లా వారోత్సవాల సందర్భంగా మరింత అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటలు జరుగకుండా గట్టి నిఘా ఏర్పాటుచేశారు. నూతనంగా ఎర్పడిన జిల్లా కావడంతో పట్టణంలో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల సత్వర పరిష్కారం
అసంపూర్తి దరఖాస్తులు, సిబ్బంది కొరతతో జాప్యం * కుడా చైర్మన్ యాదవరెడ్డి

వరంగల్, డిసెంబర్ 1: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌ను వేగవంతం చేస్తామని, ఈ మేరకు దరఖాస్తుల పరిశీలన, తనిఖీలు వేగవంతం చేయాలని పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారులను, సిబ్బందిని ఆదేశించామని సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తెలిపారు. ప్రజలు కూడా నిబంబధనల మేరకు దరఖాస్తులతోపాటు అవసరమైన సర్ట్ఫికెట్లు, ఫీజులు చెల్లించి తమ స్థలాను రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు. గురువారం కుడా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో యాదవరెడ్డి మాట్లాడుతు ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద తమ నివాస స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు గడువుగా ప్రభుత్వం నిర్ణయించగా, కుడా పరిధిలో 23వేల దరఖాస్తులు అందాయని చెప్పారు. అందులో పదివేల మంది మాత్రమే నిర్ణీత రుసుము పదివేలు చెల్లించి, పూర్తి డాక్యుమెంట్లతో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులను కుడా అధికారులు పరిశీలన జరపటంతోపాటు క్షేత్రస్థాయిలో కూడా తనిఖీలు జరిపి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులకు ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకునేందుకు సమాచారం ఇస్తారని, అర్హత లభించిన దరఖాస్తుదారులు మిగతా సొమ్ము చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవాలని అన్నారు. కానీ కొందరు దరఖాస్తుదారులు ఫీజు చెల్లించక, మరికొందరు అవసరమైన డాక్యుమెంట్లు జత చేయక దరఖాస్తులు ఇవ్వటం వల్ల ఎల్‌ఆర్‌ఎస్ అమలులో జాప్యం అవుతోందని తెలిపారు. దీనికితోడు కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం కూడా ఎల్‌ఆర్‌ఎస్ పథకం అమలుకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. కుడా పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకునేందుకు ఆర్థికశాఖ అధికారులు అనుమతి ఇచ్చారని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద అందిన దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని, అవసరమైతే రెండుగంటలు అదనంగా పనిచేయాలని కుడా అధికారులను, సిబ్బందిని కోరానని తెలిపారు. కుడా అనుమతి లేకుండా జరుగుతున్న లేఔట్లలోని ఇళ్ల స్థలాలను ఎవరు కూడా కొనుగోలు చేయవద్దని ఆయన కోరారు. కుడా అనుమతి లేని లేఔట్లలో స్థలాలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవని అన్నారు.
హృదయ్ పథకం కింద
35 కోట్లతో అభివృద్ధి పనులు
కేంద్ర ప్రభుత్వం హృదయ్ పథకం కింద కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు మంజూరుచేసిన 35.44కోట్ల రూపాయలతో చారిత్రక కట్టడాల అభివృద్ధి, మరమ్మతుల పనులు చేపడుతున్నామని యాదవరెడ్డి తెలిపారు. 15.57కోట్ల రూపాయలతో వరంగల్ కోటలో, 14.94కోట్ల రూపాయలతో భద్రకాళి బండ్ అభివృద్ధి పనులు, 2.03కోట్ల రూపాయలతో పద్మాక్షి దేవాలయ ప్రాంత అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అదే విధంగా వేయిస్తంభాల దేవాలయం వద్ద 94లక్షలతో, దర్గా వద్ద 1.78కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. హన్మకొండ బస్‌స్టేషన్ వద్ద స్పోర్ట్స్ అథారిటీకి చెందిన స్థలంలో కుడా ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని, ఇది పూర్తయ్యాక వచ్చే ఆదాయం కుడా, స్పోర్ట్స్ అథారికీ 50శాతం చొప్పున లభిస్తుందని చెప్పారు. మడిపల్లి వద్ద కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన 200ఎకరాల స్థలాన్ని లేఔట్ చేసి ఇళ్ల స్థలాలుగా విక్రయించాలని నిర్ణయించామని అన్నారు. ఇందులో ఎనిమిది ఎకరాల్లో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న 1971 స్థానంలో కొత్త మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో కుడా సిటీ ప్లానర్ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

మోథీని విమిర్శించే హక్కు విపక్షాలకు లేదు
పెద్దనోట్ల రద్దుతో పేదలకు న్యాయం * బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
జనగామటౌన్, నవంబర్ 1: ప్రధాన మంత్రి మోదీని విమర్శించే నైతిక హక్కు విపక్షాలకు ఏ మాత్రం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. జనగామ జిల్లా పార్టీ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఇటీవలే జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కెవిఎల్‌ఎన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం స్థానిక విజయ ఫంక్షన్‌హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పెద్దనోట్ల రద్దు’పై ఏర్పాటు చేసిన అవగహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి నల్లదనం వెలికి తీసేందుకు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణాయాన్ని అన్ని వర్గాల ప్రజలు, మేథావులు అభినందిస్తుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు విమర్శించడం ఎంతవరకు సమంజసం లక్ష్మణ్ ప్రశ్నించారు. గత పాలకుల హయాంలో కుభేరులు దాచుకున్న అక్రమ సంపాదనను వెలికి తీసి ప్రజలకు పంచేందుకు మోఢి చేస్తున్న ప్రయత్నానికి అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. పెద్ద నోట్ల రద్దువల్ల తాత్కాలికంఇబ్బంది కల్గినప్పటికీ భవిష్యత్‌లో పేద ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. విపక్షాలు అడుతున్న కపట నాటకాన్ని ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం, అవినీతిని ఎదురించేందుకు ఎన్‌డి ఎ ప్రభుత్వం కృషికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాపరెడ్డి, జేపాల్, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, స్థానిక నాయకులు ఉడుముల రమేష్, హరిశ్చంధ్రగుప్త, నాగారపువెంకట్, సౌడ రమేష్, తేలు ఆశోక్, పిట్టల సత్యం, కొంతం శ్రీనువాసు, కీర్తి నర్సయ్య, మంతెన మణి,జగధీష్, ఎల్లయ్యలు పాల్గొన్నారు.

ఎయిడ్స్ రహిత
సమాజానికి కృషిచేద్దాం
మానవాళి పాలిట అత్యంత ప్రమాదకరం ఎయిడ్స్ * స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి * మానుకోట కలెక్టర్ ప్రీతిమీనా పిలుపు

మహబూబాబాద్, డిసెంబర్ 1: ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. మానవాలి పాలిట అత్యంత ప్రమాధకరమైన ఎయిడ్స్‌ను తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. గురువారం డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్‌లోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రి నుండి స్థానిక తహశీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ.. హెచ్‌ఐవి కేసుల్లో మన దేశం ప్రపంచంలోనే 25లక్షల ఎయిడ్స్ బాదితులతో మూడవ స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2లక్షల ఎయిడ్స్ బాదితులతో మొదటి స్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు జిల్లాలో హెచ్‌ఐవి వ్యాప్తి చెందకుండా జిల్లా అధికారులు, స్వచ్ఛందసేవా సంస్థలు సామాజిక బాధ్యతగా గుర్తించి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువతల్లో ఎయిడ్స్ మహమ్మారిపై విస్తృత ప్రచారం కల్పించి వారిలో అవగాహన కల్పించాలని అన్నారు. 1988 నుండి ప్రతి సంవత్సరం ఎయిడ్స్ నివారణ దినోత్సవం జరుపుకుంటు ప్రజల్లో వ్యాది పట్ల చైతన్యం కలిగించడం జరుగుతుందన్నారు. ఎయిడ్స్‌కు సరైన చికిత్స లేదని చికిత్స కన్న నివారణే ముఖ్యమన్నారు. జిల్లాలో 17ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఎయిడ్స్ వ్యాది నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. విస్తృత ప్రచారం వల్ల గత రెండు దశాబ్దాలతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవి కేసుల సంఖ్య తగ్గిందన్నారు. ఎయిడ్స్‌వ్యాది లక్షణాలు, ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుందని తదితర వివరాలను విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. హెచ్‌ఐవి సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవని శరీరంలో హెచ్‌ఐవి వైరస్ బలం పుంజుకున్న తర్వాత వ్యాది లక్షణాలు కనబడుతాయన్నారు. మూడవ దశలో హెచ్‌ఐవి ఇన్‌స్పెక్షన్ ఎయిడ్స్‌గా మారి రక్తంలోని సిడి 4 కణాల సంఖ్య 500మిల్లీమీటర్లకు పడిపోతుందన్నారు. ఈ స్థితికి చేరుకున్న వారిలో హ్యుమోనియా, మెదడు ఇన్‌స్పెక్షన్,జ్వరం, డయోరియా, బరువుతగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఎయిడ్స్ వాది నిర్యూలనకు జిల్లాలో విస్తృత స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. హెచ్‌ఐవి బాధితులతో సత్సంబందాలు కలిగి ఉండి వారికి నైతిక తొడ్పాటు అందజేయాలన్నారు. వ్యక్తిగతంగా ఎయిడ్స్ వ్యాది పట్ల అవగాహనతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవొ భాస్కర్‌రావు, డిప్యూటీ డింఎంహెచ్‌వొ వెంకటనారాయణ, డిటిడబ్ల్యూవో స్వర్ణలత, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భీసాంగర్, జెడ్పిటీసీ వెంకన్న, ఐసిటిసీ సతీష్, ఎంఈవొ వివేకానంద, డాక్టర్ రాజేష్, సుగుణాకర్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా, స్వచ్ఛందసంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గత సంవత్సరంలో జిల్లాలో ఎయిడ్స్ వ్యాది చేందకుండా ప్రజల్లో అవగాహన కల్పించి విశిష్ట సేవలు అందించిన వారికి జిల్లా కలెక్టర్, జెసి, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు ప్రశంస పత్రాలు అందజేశారు.

ఆధునిక యుగంలో
ఆకలిని నిర్మూలిద్దాం
*అర్బన్ కలెక్టర్ అమ్రపాలి
వడ్డేపల్లి, డిసెంబర్ 1: ఆధునిక యుగంలో ఆకలితో అలమటించ కూడదనే సంకల్పంతో ముందుకు సాగాలని అర్బన్ కలెక్టర్ అమ్రపాలి అన్నారు. గురువారం నగరంలోని అభాగ్యులకు ఉచితంగా ఆహారం అందజేయాలనే అకాంక్షతో సుబేదారిలోని పాలమూరు గ్రిల్ కారిడార్‌లో సహకార అన్నం- అన్నం పరబ్రహ్మం అనే కార్యక్రమాన్ని లాంఛనంగా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మహానగరంలో ప్రతి రోజు అనేక శుభకార్యాలు, వేడుకలు, హోటళ్లు, ఇళ్లల్లో మిగిలిపోయిన నాణ్యమైన ఆహారాన్ని సహకార కేంద్రాల ద్వారా అందజేయాలని తెలిపారు. వరంగల్ నగరంలోని తొమ్మిది ప్రధాన కూడళ్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లలో ఆహారాన్ని భద్రపరచి, ప్రతిరోజు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అధ్వర్యంలో నాణ్యతను పరిశీలించి అభాగ్యులైన నిరుపేదలకు ఉచితంగా అందజేస్తారని తెలిపారు.
కేంద్రాలలో నిర్వహణలో కార్పోరేషన్, మున్సిపల్ హెల్త్ అధికారులు, హోటల్ యాజమాన్యులు భాగస్వాములుగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కేంద్రాలకు నగర ప్రజల నుండి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని మిగతా ప్రాంతాలలో నూతనంగా ఉచిత సహకార అన్నం కేంద్రాలను ప్రారంభిస్తారని వివరించారు. నిరుపేదలు, అభాగ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ స్వయంగా తీసుకుని వచ్చిన అల్పాహారాన్ని కేంద్రంలో అందజేసి, ప్రజల నుండి వచ్చిన ఆహారాన్ని అభాగ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మసూద్ అలీ, ఎంహెచ్‌ఒ రాజారెడ్డి, ఫుడ్ ఇన్సిపెక్టర్ రామకృష్ణ, పౌరసంబంధాలశాఖ ఉపసంచాలకులు డిఎస్ జగన్, పాలమూరు హోటల్ యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.