వరంగల్

విడతల వారీగా సొంత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 3: రెవెన్యూ, రిజిస్ట్రార్ శాఖ ల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్టవ్య్రాప్తంగా అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో నిర్మించిన ఖిల్లా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతు పరిపాలన ప్రజలకు చేరువగా ఉండేందుకు, ప్రజాసమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం పాత జిల్లాలను పునర్విభజించి మొత్తం 31జిల్లాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. దీనివల్ల అధికారులు, సిబ్బంది ప్రజలకు అం దుబాటులో ఉండటంతోపాటు అధికారులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా పర్యవేక్షించేందుకు, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి సానుకూల స్పం దన వచ్చిందని చెప్పారు. కొత్త జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణాలకు, వౌళిక సదుపాయల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకశ్రద్ద తీసుకోవాలని కోరా రు. సొంత భవనాలు లేని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు విడతల వారీగా వచ్చే మూడేళ్లలో సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా 20్భవనాల నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల పెన్షన్ల మొత్తాన్ని పెంచటంతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి విశేష కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. హైద్రాబాద్ నగరం తరువాత వరంగల్ నగరానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, నగరంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్‌భాస్కర్, కలెక్టర్ ఆమ్రపాలి, జాయింట్ కలెక్టర్ దయానంద్, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, జిల్లా రిజిస్ట్రార్ సుభాషిణి పాల్గొన్నారు.

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి
నక్కలగుట్ట,డిసెంబర్ 3: ప్రతిభలో దివ్యాంగులకు ఎవరూ తీసిపోరని, అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించవచ్చునని, దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తుందని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ భవన్‌లో సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతిభలో అత్యున్నత ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. సివిల్ సర్వీస్‌లో మంచి ప్రతిభ చూపించి చత్తీస్‌ఘడ్‌లో ఐఎఎస్ అధికారిగా కొనసాగుతున్నారని గుర్తుచేశారు. లక్ష్యం, అంకితభావం, కష్టపడే తత్త్వం ఉంటే అంగవైకల్యం అడ్డుకాదని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ పద్మ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత నివ్వడానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రత్యేక ప్రతిభ కలిగి ఉంటారని, వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్య6కమంలో వికలాంగులశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్దిశాఖ, మహిళాశిశుసంక్షేమశాఖ, మెప్మా, డిఇఒలు పాల్గొన్నారు.

షీ టీమ్స్‌తో భరోసా
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబాబాద్, డిసెంబర్ 3: నూతనంగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాను పోలీసు సిబ్బంది సమి ష్టి కృషితో, ప్రజల సహకారంతో నేర రహిత జిల్లాగా మార్చే దిశగా ముం దుకు సాగుతామని జిల్లా ఎస్పీ మురళీధర్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం జిల్లా ఎస్పీ మురళీధర్ షీ టీమ్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇదే సం దర్భంలో కేంద్ర నేర పరిశోధక విభా గం కార్యాలయం, మహిళా కౌన్సిలింగ్ సెంటర్లను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ.. ఇప్పటికే మహబూబాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను చాలా వరకు పరిష్కరించడం జరిగిందన్నారు. దొంగతనాలు నివారణకు అనేక చర్యలు తీసుకున్నామని, చాలా వరకు తగ్గించగలిగామన్నారు. మహిళలకు భరోసాను ఇవ్వడంకోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కేంద్రంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో షీ టీమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, సమస్యలు ఏర్పడినా 8333923847 వాట్సప్ నెంబరుకు సమాచారం ఇవ్వవచ్చని, 100కు ఫొన్ ద్వారా గాని, ఎంహచ్‌బిడి షీ టీమ్స్‌కు మెయిల్ ద్వారా గాని సమాచారం అందించవచ్చని తెలిపారు. ఎవరైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీ టీమ్స్ నిరంతరం రద్దీగా ఉండే అన్ని ప్రాంతాలతోపాటు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం నిఘా వేసి ఉంచుతాయని అన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా అందుకు బాధ్యులైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. నేర రహిత జిల్లాగా మానుకోటను మార్చాలనే సంకల్పానికి జిల్లా ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ రాజమహేంద్రనాయక్, జిల్లా పరిధిలోని రూరల్ సిఐ కృష్ణారెడ్డి, కురవి సిఐ శ్రీనివాస్‌నాయక్, సీసీఎస్ సీఐ ఎస్.వెంకటేశ్వర్‌రావు, బయ్యారం సీఐ సాంబయ్య, షీ టీమ్స్ ఇంచార్జ్ ఎస్సై మోహన్‌రావు, టౌన్ ఎస్సై తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

విద్యాప్రమాణాలుపాటించాలి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూరిభా పాఠశాలలు, కళాశాలల్లో వౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం 116కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో వౌళిక సదుపాయాలు కల్పించటం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఉన్ని దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కడియం మాట్లాడుతు ఉన్నత విద్యాప్రమాణాలు పాటించటం ద్వారా విద్యావిధానంలో నూతన ఒరవడి నెలకొల్పడానికి కెజి టు పిజి విద్యావిధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. విద్యాసంస్థల్లో వౌళిక సదుపాయల ఏర్పాటుకు, ముఖ్యంగా భవనాలు, మంచినీటి ప్లాంట్లు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీగోడలు, డిజిటల్ ఆడియో, వీడియో తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకుంటున్న మూడులక్షలమంది రెసిడెన్షియల్ విద్యార్థినీ, విద్యార్థులకు 15కోట్ల రూపాయల వ్యయంతో దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యాసంస్థలో విద్యార్థుల భద్రత ముఖ్యమని చెప్పారు. పాఠశాలల్లో సాధారణంగా చెప్పే భోదనతోపాటు వివిధ పోటీ పరీక్షల్లో బాలికలు పైచేయిగా ఉందని అన్నారు. హసన్‌పర్తి ప్రభుత్వ గురుకుల పాఠశాల అభివృద్ధికి ఆరుకోట్ల రూపాయలతో అకడమిక్ బ్లాక్, మూడు కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదులు మంజూరు చేసామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసాయని, తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలను పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, వరంగల్ నగర మేయర్ నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్, ప్రభుత్వ గురుకులాల సంస్థ కార్యదర్శి శేషుకుమారి, జాయింట్ కలెక్టర్ దయానంద్, విద్యాశాఖ ఆర్‌జెడి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ఆత్మకూర్,డిసెంబర్ 3:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెంది, ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన దామెర మండలంలోని ఊరుగొండ గ్రామ శివారులోని 163వ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఆత్మకూర్ మండలం హౌజ్‌బుజూర్గు గ్రామానికి చెందిన కటాక్షపూర్ ఎంపిటిసి గోరీబి భర్త సయ్యద్ కరీం (29), అదే గ్రామానికి చెందిన షేక్ యాకూబ్(27)లు కరీం ద్విచక్ర వాహనంపై హన్మకొండకు వెళ్లి పనులు ముగించుకుని, యాకూబ్ మరదలు దామెర సృజనను వెంట తీసుకుని హౌజ్‌బుజూర్గుకు వస్తున్నారు. పసరుగొండ గ్రామ సమీపంలోకి రాగానే బొలేరో వాహనం వేగంగా వచ్చి కరీం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో కరీం, యాకూబ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. సృజనకు తీవ్రగాయాలు కాగా చికిత్సకోసం స్థానికులు ఎంజి ఎం ఆసుపత్రికి తరలించారు. కరీంకు ఇద్దరు కుమారులు, యాకూబ్‌కు భార్య సమీన, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆత్మకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను ఎంజి ఎం మార్చురీకి పంపారు.

రహదారిపై పోలీసుల గస్తీ..
వారోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు
గోవిందరావుపేట, డిసెంబర్ 3: పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలలో ఎజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు. జాతీయ రహాదారిపై పికెటింగ్‌లు ఎర్పాటు చేసి వాహానాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకూ పోలీసుల తనిఖీలు మండలంలో కొనసాగాయి. ఏజెన్సీలో పట్టు సడలిన నక్సల్స్ తమ పట్టును బలోపేతం చేసేందుకు వారోత్సవాలలో సంచలన సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందనే ఇంటలీజెన్సీ సమాచారంతో స్దానిక పోలీసులు రంగంలోకి దిగారు. పస్రా ఎస్‌ఐ రాందేని స్వామి ఆధ్వర్యంలో సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో వాహానాల తనిఖీని చేపట్టారు. పస్రా అటవీ ప్రాంతంలో గట్టి పట్టున్న మావోలు గత కొంత కాలంగా స్తబ్దతగా ఉండగా వారోత్సవాలలో ఎటువంటి సంఘటనలకు పాల్పడతరో ననే సందేహాంతో పోలీసులు తమ గస్తీని మరింత ముమ్మరం చేస్తున్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ రాస్తారోకో
భీమదేవరపల్లి, డిసెంబరు 3: రాష్ట్రప్రభుత్వం విద్యారంగ సమస్యలు వెంట నే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్‌యాదవ్, జిల్లా కార్యవర్గసభ్యులు రాజేశ్‌నాయక్‌ల ఆధ్వర్యంలో శనివారం ముల్కనూర్‌లో వరంగల్- సిద్ధిపేట హైవేపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగానికి అధికంగా నిధులు కెటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీని మరించిందన్నారు. కేవలం వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యార్ధుల ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబందించిని బిల్లులు 20కోట్ల వరకు బకాయిలు ఉన్నాయన్నారు. విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కసూర్బాను సందర్శించిన ఏసిపి
నెక్కొండ, డిసెంబర్ 3: నెక్కొండ మండలం పెద్దకొర్పోలు గ్రామంలోని కస్తూర్భా గురుకులాన్ని ఏసిపిమురళీధర్ శనివారం సందర్శించారు. కస్తూర్భా విద్యాలయ ప్రాంగణంలోకి అపరిచితులు సంచరించారనే విషయమై విచారణ జరిపేందుకు గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థినులు, సిబ్బందితో మాట్లాడారు. గురుకులంలో విద్యార్థుల రక్షణకు అవసరమైన చర్యలను సూచించారు. అలాగే గురుకులంలోకి ఎవరూ ప్రవేశించకుండా ముళ్ల కంచె ను ఏర్పాటు చేయాలని ఏసిపి ఆదేశించారు.

మినీ స్టేడియాన్ని పరిశీలించిన పెద్ది
నర్సంపేటలో 9 నుండి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
నర్సంపేట, డిసెంబర్ 3: నర్సంపేట పట్టణంలో ఈనెల 9 నుండి 11వ తేది వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఈమేరకు నర్సంపేటలో జరుగుతున్న వరంగల్ రూర ల్ జిల్లా కబడ్డీ క్రీడాకారుల శిక్షణా శిబిరాన్ని శనివారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించారు. మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మహిళలు, పురుషుల విభాగంలో జరగనున్నాయి. పట్టణంలోని వల్లబ్‌నగర్ మినీ స్టేడియాన్ని పెద్ది పరిశీలించారు. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అవినీతి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 3: సమాజాన్ని పట్టిపీడుస్తున్న అవినీతి నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వామలు కావాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి సూచించారు. ఈనెల తొమ్మిదిన జరిగే అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏసిబి ఆధ్వర్యంలో నిర్వహించే వారోత్సవాలలో భాగంగా శనివారం ఏకశిల పార్కు వద్ద చేపట్టిన ర్యాలీని కలెక్టర్, నగర పోలీసు కమీషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అవినీతి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు అం దరూ సహకరించాలని చెప్పారు. సమాజం నుంచి అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తేనే ప్రజలంతా బాగుపడతారని తెలిపారు. అవినీతి నిర్మూలన ద్వారా దేశాభివృద్ధికి పూనాదులు వేయాలని, ప్రభుత్వ ఉద్యోగు లు ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాలని అన్నారు. పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతు అవినీతి నిర్మూలనలో అందరి భాగస్వామ్యం అవసరమని అన్నారు. లంచం తీసుకోవట మే కాకుం డా లంచం ఇవ్వటం కూడా నేరమేనని చెప్పారు. కొత్త గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జిల్లాలో అవినీతి నిర్మూలనలో విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. వారం పాటు జరిగే అవినీతి నిర్మూలన వారోత్సవల సందర్భంగా ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలన్నారు. ఏసిబి డిఎస్పీ సాయిబాబా, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో బయోమెట్రిక్
సంగెం, డిసెంబర్ 3: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం సంగెం మండల కేంద్రం లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బాలికలకు ఉలన్ దుప్పట్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా చైర్‌పర్సన్ గద్దెల పద్మ, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బాలికల చదువు పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్దతోనే ఉలన్ దుప్పట్లను పంపిణి చేయడం జరుగుతుందన్నారు. దేశస్థాయి విద్యా ప్రమాణాలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. 2016-17 సంవత్సరంలో 241 రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పమని, 2017-18 సంవత్సరం లో మరో 210 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువే విద్యార్థుల కోసం ఇంటర్ రెసిడెన్షియల్ స్కూల్‌లలో 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. సంగెం కస్తూర్బాగాంధీ పాఠశాలలో 10 రోజుల్లో బయోమెట్రిక్ అమలు చేయడం తో పాటు మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల చుట్టు రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. 100 శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. బాలికల పట్ల ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపిపి కట్టయ్య, జడ్పిటిసి వీరమ్మ, ఎంపిటిసి, సర్పంచ్ మల్లికాంబ, రూరల్ జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి, పాఠశాల ప్రత్యేక అధికారిణి నీలిమా, గ్రేన్ మార్కెట్ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

పోతే పొండి!
జఫర్‌గడ్, డిసెంబర్ 3: జఫర్‌గడ్ మం డల సర్వసభ్య సమావేశం పోలీసుల బం దోబస్తు నడుమ తూతూమంత్రంగా జరిగింది. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే డా. రాజయ్య రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు ప్రణాళికతో జనగామ డిసిపి వెంకన్న, మమునూరు ఎసిపి మహేందర్‌ల సారధ్యంలో భారీ బలగాలను మోహరించారు. సమావేశానికి ఎమ్మెల్యే రాజ య్య హాజరుకాగానే మండలసభలో వైస్ ఎంపిపి ఎలీయా నిలబడి జఫర్‌గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లా లో కలపాలని, అంత వరకు మండల సభలో ఉండమని తేల్చిచెప్పడంతో సభలో ఉండాలనుకున్న వారు ఉండొచ్చు.. లేకపోతే వెళ్లిపొమ్మని ఎమ్మెల్యే రాజయ్య అనడంతో పలువురు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు నిరసనలు తెలిపి వెళ్లిపోయారు. అనంతరం 6 ఎంపిటిసిలు, 5 సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమక్షంలో మూడు శాఖలపై చర్చించి ఎమ్మెల్యే వెళ్లగానే సభను ముగించారు. మూడు నెలలకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై చర్చించి అన్ని శాఖలతో సమీక్షించిన తర్వాతనే సమావేశం ముగేసేదని, కాని మూడు శాఖలపై ముచ్చటగా ముగించారని వైస్ ఎంపిపి ఎలీయా అన్నారు.

మూడవ రోజు సుబ్రహ్మణ్య మహాయాగం
వరంగల్ (కల్చరల్) డిసెంబర్ 3: వరంగల్ నగరంలోని భద్రకాళీ దేవాలయంలో వైభవంగా జరుగుతున్న సుబ్రహ్మణ్య మహాయాగం మూడవ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆరుగంటలకు అమ్మవారికి నిత్యాహ్నికం, సుప్రభాత సేవ, చక్రార్చనలు నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరి సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన, అఘోర, అథోముఖములతో ఉన్న షణ్ముఖుడికి పంచామృత, ఫలరస, వివిధ పుణ్యజలాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.