వరంగల్

కత్తిమీద సాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 9: కస్తూరిభా విద్యాలయాలలో ప్రస్తుతం పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుండగా, ఈ విద్యాలయాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిని పలుమార్లు కోరామని చెప్పారు. విద్యాశాఖను పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా కొత్తగా 256గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించగా, వచ్చే ఏడాది మరో 210గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో తరగతులు ప్రారంభిస్తామని అన్నారు. కస్తూరిభా బాలికల విద్యాలయాలలో విద్యాభోధన మెరుగుపరచటం ద్వారా ఫలితాలు బాగా వచ్చేలా ఉపాధ్యాయులు మరింతగా కృషి చేయాలని ఆయన కోరారు. జోన్-5 పరిధిలోని 15జిల్లాలకు చెందిన కస్తూరిభా ప్రత్యేక అధికారుల సమావేశం శుక్రవారం నగరంలోని జిల్లాపరిషత్ మీటింగ్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతు 2016 మార్చినెలలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో కెజిబివిలలో 96శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించటాన్ని అభినందించారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 391కెజిబివిలలో 73వేలమంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారని, వీరిలో చాలామంది బడుగు, బలహీనవర్గాల వారు, అనాథలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారని, వీరందరిని ఒకచోట చేర్చి చదివించటం కత్తిమీద సాము వంటిదని చెప్పారు. రాష్ట్రంలోని కెజిబివిలపై 212కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కస్తూరిభా విద్యాలయాల్లో ప్రహరీగోడ, సిసి కెమెరాలు, వాటర్‌ప్లాంట్ తదితర కనీస సౌకర్యాల ఏర్పాటుకు 64కోట్లు మంజూరు చేసామని తెలిపారు. ఈ ఏడాది 73వేల ఊలు బ్లాంకెట్లు విద్యార్థులకు సరఫరా చేసామని చెప్పారు. ప్రతి కెజిబివిని వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారి దత్తత తీసుకుని వాటిలోని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించామని తెలిపారు. మూడేళ్లపాటు నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించగలిగితే విద్యాప్రమాణాలు, ఉత్తీర్ణత శాతం పెరిగి ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కిషన్ మాట్లాడుతు విద్యాలయాలలో చదువులు అంటే విద్యార్థులు శిక్షగా బావించకుండా సంతోషంగా చదువుకునే వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు. విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలు, లైఫ్‌స్కిల్స్ పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. కెజిబివిలలోని సమస్యలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా, వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కెజిబివి అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్, అర్బన్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.గడీలపై పేద విద్యార్థుల పోరాటం

గడీలపై పేద విద్యార్థుల పోరాటం
నక్కలగుట్ట,డిసెంబర్ 9:విద్యార్థుల ఉద్యమాలను అణచివేయాలని చూస్తే, అవి ఉవ్వెత్తున లేస్తాయనే విషయం గతంలో పంతులుగా పనిచేసిన ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరికి తెలువకపోవడం శోచనీయమని టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో హన్మకొండలోని జయశంకర్ స్మృతి వనం నందు విద్యార్థి పోరు బహిరంగసభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు, నిరసనలు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి విద్యార్థులు నిరసన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం 3230 పాఠశాలలను, 270 ఇంజనీరింగ్ కళాశాలలను మూసి వేసిందని, దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. బడులను మూసివేస్తున్న ప్రభుత్వం బార్లను మాత్రం ప్రజల దామాషా ప్రకారం తెరుస్తున్నదని పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఫీ రీయింబర్స్‌మెంట్ కోసం ఉద్యమం చేస్తుంటే, వారిపై కేసులు పెట్టి జైలు పంపడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఫీజులు కట్టకపోవడం వలన డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు కూడా సర్ట్ఫికేట్స్ తీసుకోలేక పోతున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు చరిత్ర నిర్మాతలని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను దూ రం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబపాలన అంతం అయితే తప్ప ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. జాతీయ అధికార ప్రతినిథి పెద్దిరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకాక ముందే ఫీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో సమావేశాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. రాజరిక వ్యవస్థతో పరిపాలన చేయాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. బంగారు తెలంగాణను తెస్తానని ప్రజలకు చెప్పిన ముఖ్యమంత్రి గడీల పాలన తేవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ విద్యార్థుల హక్కుల కాలరాస్తున్నాడని, ఫీరీయింబర్స్‌మెంట్ అనేది విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కుఅని గుర్తుచేశారు. బంగ్లాలకు, గుడులకు, గోపురాలకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఫీ రీయింబర్స్‌మెంట్, సంక్షేమ హాస్టళ్లు, విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉపకారవేతనాలు, విశ్వవిద్యాలయాలలో, పాఠశాలల్లో ఉపాద్యాయ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరుబాట సాగుతుందని వివరించారు. అంతకు ముందు విద్యార్థులతో కలసి టిడిపి నాయకులు ఎస్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అక్కడి నుండి ర్యాలీగా బయర్దేరి అంబేద్కర్ చౌరస్తామీదుగా ఏకశిలా పార్కుకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మధుసూదన్‌రెడ్డి, సంతోష్ నాయక్, రాజారాం, బాలలక్ష్మీ, సంపత్‌నాయక్, నర్సింరెడ్డి తదితరులు పాల్గొన్నారు.