వరంగల్

గీతా పఠనం జీవితానే్న మార్చేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, డిసెంబర్ 10 : భగవద్ఘీత పఠనం మనిషి జీవితానే్న మారుస్తూందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని పెర్కవేడు శివసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్ధులకు గీతా శ్లోక పఠనంపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రముఖ యోగా గురువు బ్రహ్మశ్రీ శ్రీజ్ఞాన చైతన్య నంద స్వామిజీలు హజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్ఘీత సారాంశం భావి తరాలకు అందించవలసిన బాద్యతా మనపై ఉందన్నారు. గీతా పఠనం ప్రతి ఒక్కరు అలవర్చుకొని పాటించాలని సూచించారు. విద్యార్ధుల్లో చిన్నతనం నుంచే శ్లోకా లు పటించడం ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషేనని అభినందించారు. హిం దూ సంస్కృతి సాంప్రదాయాల తో పాటు పురాణాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కొమురుమల్లు, కొండూరు ప్రధానోపాద్యాయు డు సత్యనారాయణ, సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాల్ జ్యోతి, గ్రామ సర్పంచ్ అనిత, సేవాట్రస్ట్ అధ్యక్షుడు నరేందర్, పుల్లూరు రాజశేఖర్, పాల్గొన్నారు.

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆర్డీఎఫ్
నెక్కొండ, డిసెంబర్ 10: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయి పోటీల్లో రాణించేలా ఆర్డీఎఫ్ ఉన్నత పాఠశాల తీర్చిదిద్దడం అభినందనీయమని ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ అన్నారు. నెక్కొండ మండలం రెడ్లవాడలో జరిగిన స్టూడెంట్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయస్థాయి పోటీల్లోను రాణించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సర్పంచి సంతోష్‌కుమార్, ఎంపిటిసి సభ్యుడు విజయకుమార్‌రావు, పాఠశాల పిఈటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి
భీమదేవరపల్లి, డిసెంబర్ 10: గ్రామీణ ప్రాంతాల లో వౌలిక వసతులు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం కృషి సించాయోజన పధకం కింద 56 వేల కోట్లు మంజూరు చేసిందని భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం సాయిబాబ ఆలయం లో దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుగుణాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లో దేశంలో 25 లక్షల వరకు ఇళ్లు లేని నిరుపేదలు ఉన్నారని, వీరందరికి ప్రధానమంత్రి కృషి సం చాయోజన పధకం కింద ఇళ్లు నిర్మాణం కొరకు కేం ద్రం నిధులు మంజూరి చేస్తున్నదన్నారు. అదే విధం గా గ్రామాల్లో సడక్‌యోజన పధకం కింద గ్రామాల్లో రోడ్లు నిర్మాణం, రైతుల సాగునీటి పధకాల కొరకు, అన్ని రాష్ట్రాలలో గ్రామపంచాయితీలకు నిధులు గ్రామాల అభివృద్ధి కృషి సించాయోజన పధకం కింద నిధులు వెచ్చించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్రప్రభుత్వం నిధులు రబీ సీజన్‌లో రైతుల కొరకు 13 వేల కోట్లు ఇచ్చిందని, దీంట్లో తెలంగాణ ప్రభుత్వం 4 వేల కోట్లు ఖర్చు చేసి మిగ తా నిధులు మిగతా పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామని కేవలం హైద్రాబాద్‌లో ఒక వాడకు, రాష్ట్రంలోని ఒక ఎర్రవల్లి గ్రామానికి మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరి ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైద్రాబాద్‌లోని ఒక వాడ, రాష్ట్రంలో ఒక గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు లేరా? అని ప్రశ్నించారు. కె జి నుండి పిజి వరకు ఉచిత విద్యను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం ఎందుకని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు అనేక రకాల హామీలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎండగడుతామన్నారు. తెలంగాణ ప్రభు త్వం ప్రజలు ఇచ్చిన హామిలపై అసెంబ్లీ సమావేశాలలో బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రభుత్వంను నిలదీయడం జరుగుతుందన్నారు. సమావేశంలో బిజెపి నాయకులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, దుర్గాసింగ్, దొంగల కొరయ్య, పందిసారయ్య, పెద్ది ప్రకాశం, శ్యామ్,పృధ్వీ, కుమారస్వామి, అడ్డగట్ల హరిశంకర్, రాజేందర్, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.