వరంగల్

తరగతి ఏదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్ టౌన్, డిసెంబర్ 10: ఈ విద్యాసంవత్సరం పూర్తి కావొస్తున్నా ఇంతవరకు బిఈడి తరగతులు ప్రారంభం కాలేదు. అసలు క్లాసులు జరుగుతాయా, జరుగవో ఏమి తెలియని దిక్కుతోచని స్థితిలో విద్యార్థు లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిఈడి విద్యార్థిని విద్యార్థులను పట్టించుకునే పాపాన పొలేదు. గతంలో బిఈడి కోర్సు ఒక సంవత్స రం ఉండగా ఈ యేడాది నుండి దాని ని రెండు సంవత్సరాలకు పెం చారు. 2016-18సంవత్సరానికి జూన్, జులై లో మొదటి దఫా కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం రెండు, మూడు కౌన్సిలింగ్‌లు జరుగాల్సి ఉం డగా ప్రభుత్వం ఇంత వరకు ఆ దిశగా ఆలోచన చెయకపోవడంతో విద్యార్థులు ఆయోమయంలో పడ్డారు. విద్యా సంవత్సరం సంగం పూర్తి అయి రెండోవ సంవత్సరంలోకి వెళ్లా ల్సి ఉండగా ఇంత వరకు కూడా ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఎంతో మంది విద్యార్థులు బిఈడి ఎంట్రెన్స్ రాసి రెండు, మూడు కౌన్సిలింగ్‌లకు ఆప్షన్ పెట్టుకున్నా ఇంత వరకు సరైన సమాదానం రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ సంవత్సరం బిఈడి ఒక సంవత్సరమా లేక రెండు సంవత్సరాలు నిర్వహించాలా అని ప్రభు త్వం సమాచారం ఇస్తేనే తాము ఆ దిశ గా అడుగులు వేస్తామని సంబందిత అధికారులు చెబుతున్నారు. ఏది ఎమైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. కచ్చితమైన నిర్ణయంతీసుకోని బిఈడి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

‘స్వశక్తి’తో ఆత్మస్థైర్యం

వరంగల్, డిసెంబర్ 10: వరంగల్ నగరంలో మహిళలపై, విద్యార్థినులపై పెరుగుతున్న వేధింపులను అరికట్టడం ద్వారా ఈవ్‌టీజింగ్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని నగర పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు శనివారం తెలిపారు. స్వశక్తి పేరిట కొత్తగా చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా సుమారు మూడువేల మంది మహిళలకు, విద్యార్థినులకు సెల్ఫ్ డిపెన్స్‌పై పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు షీ-టీంలను ఏర్పాటు చేసామని, వీటి పనితీరు సంతృప్తికరంగా ఉందని చెబుతు, ఈ షీ-టీంలతో మహిళలను, విద్యార్థినులను భాగస్వామ్యం చేస్తు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వ్యక్తులను ఎదుర్కొనేందుకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసామని అన్నారు. ఆత్మరక్షణ కోసం సులభమైన మెళుకువలు నేర్చుకోవటం ద్వారా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే ఎవరినైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని, కరాటే శిక్షక్షురాలి ఆధ్వర్యంలో మహిళలకు, విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్‌లో ఒకరోజు శిక్షణ ఇస్తామని తెలిపారు. షీ-టీం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనదలచిన మహిళలు, విద్యార్థినులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.షీటీంవరంగల్.కామ్ వెబ్‌సైట్‌కు సోమవారం నుంచి లాగిన్ అయి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చని అన్నారు.