జాతీయ వార్తలు

జకీర్ నాయక్ ఆఫీసు వద్ద నిరసన సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రంజాన్ పర్వదినం రోజున గురువారం బంగ్లాదేశ్‌లో ఈద్గా మైదానం వద్ద ఉగ్రవాదుల దాడిలో నలుగురు మరణించిన ఘటనపై ముంబయిలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కార్యాలయం వద్ద ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఇటీవల ఢాకాలో బాంబు పేలుళ్ల తర్వాత ఓ ఉగ్రవాది మీడియాతో మాట్లాడుతూ తాను ముంబయికి చెందిన జకీర్ నాయక్ ప్రసంగాల ద్వారా స్ఫూర్తి పొందినట్లు చెప్పడం సంచలనం సృష్టించింది. ఉగ్రదాడులకు జకీర్ నాయక్ ప్రసంగాలు దోహదపడుతున్నట్లు తెలియడంతో ఆందోళనకారులు నిరసనలు ప్రారంభించారు. జకీర్ ప్రసంగాలను నిఘా వర్గాలు పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ జిజ్జు ఇటీవల ప్రకటించారు. కాగా, తన బోధనలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఉగ్రవాదుల చర్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని జకీర్ ప్రకటించారు. పేద ముస్లిం విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు తాను ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని ఆయన చెబుతున్నారు.