S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/25/2019 - 00:38

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ప్రజాప్రయోజనానికి సంబంధించిన విషయం ఏముందని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు జరుగుతుండగా జోక్యం చేసుకోలేమని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

09/24/2019 - 22:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: డెయిరీ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన గేదెల కొనుగోలుకు రుణం మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఉదంతమిది. హర్యానాలోని రేవరి జిల్లా కన్వాలిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సుమర్ సింగ్ డెయిరీ యూనిట్ కోసం 24.72 లక్షల రుణం మంజూరు చేసేందుకు బాధితుడి నుంచి లక్ష రూపాయిలు డిమాండ్ చేశాడు.

09/24/2019 - 05:54

తుంగతుర్తి, సెప్టెంబర్ 23: ఇటు పోలీసుశాఖలో, అటు కుటుంబ సభ్యులు, ప్రజల్లో ఉత్కంఠత కలిగించిన హోంగార్డు కటకం రవితో పాటు ఆయన కుటుంబం అదృశ్యం కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. రవితోపాటు భార్య పద్మ, కూతుళ్లు సింధు, స్పందన శనివారం ఉదయం అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే సంఘటనని ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు కేవలం 15 గంటల వ్యవధిలోనే దీనిని ఛేదించడం విశేషం.

09/24/2019 - 05:29

రంపచోడవరం, సెప్టెంబర్ 23: గోదావరి నదిలో బోటు ప్రమాదానికి సంబంధించిన కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం రంపచోడవరం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద జరిగిన బోటు ప్రమాదానికి కారణమైన ముగ్గురిని ఇప్పటికే అదుపులోనికి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.

09/24/2019 - 04:07

న్యూఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన కేసులో సీనియర్ ఐఎఎస్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియా సిమెంట్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా నీటిని విడుదల చేశారన్న అభియోగంపై ఆదిత్యనాథ్ దాస్‌ను తప్పిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

09/24/2019 - 04:01

హైదరాబాద్, సెప్టెంబర్ 23: యూసుఫ్‌గూడలో ఓ వినియోగదారుడికి నాలుగు మీటర్లకు సంబంధించిన ప్యానెల్‌బోర్డును మంజూరు చేసేందుకు రూ.70 వేలు డిమాండ్ చేసిన టీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్‌తో పాటు అతనికి ప్రైవేట్ అసిస్టెంట్‌గా వ్యవరించిన వ్యక్తిని తెలంగాణ ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఎస్.

09/24/2019 - 03:50

మచిలీపట్నం, సెప్టెంబర్ 23: కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ డా. ఎన్ ఉషాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. విశ్వ విద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జె నవీన లావణ్యలత ఫిర్యాదుతో మచిలీపట్నం ఇనగుదురు పోలీసులు రిజిస్ట్రార్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

09/24/2019 - 03:41

బాలాపూర్, సెప్టెంబర్ 23: ఎవరు లేని ఇంటి నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసిన సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీర్‌పేట్ వినాయకహిల్స్ రోడ్డు నెంబర్ 16లో నివాసం ఉండే వెంకటేష్ తండ్రి నారయ్య ప్రభుత్వ ఉద్యోగి. కుమారుడికి జ్వరం రావడంతో ఈ నెల 19న ఆసుపత్రికి వెళ్లాడు. సోమవారం వెంకటేష్ తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి.

09/24/2019 - 03:38

జీడిమెట్ల, సెప్టెంబర్ 23: బంగారం దుకాణంలో చోరీ చేసేందుకు సిద్ధమైన దుండగులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై పైకి కారును పోనిచ్చిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం దుందిగల్ ఎస్సై శేఖర్ రెడ్డి బాలానగర్ జోన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు.

09/24/2019 - 03:37

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 23: కాలనీలలో తిరుగుతూ రేషన్ బియ్యం అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహరాష్ట్ర బాందేడ్ ప్రాంతానికి చెందిన కైజర్‌బెగ్ కురిషిద్(38) కాలనీలలో ఆటోలో తిరుగుతూ రేషన్ బియ్యం విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Pages