S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/24/2019 - 00:56

నర్సీపట్నం : విశాఖ ఏజన్సీలో మరో ఎన్‌కౌంటర్ చేసుకుంది. జీకేవీధి మండలం గుమ్మిరేవుల శివారు ప్రేమలగొంది అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం ఉదయం మాదిగమల్లు - అన్నవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ముగ్గురు మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే.

09/23/2019 - 23:43

కర్నూలు, సెప్టెంబర్ 23: రూ.కోటిన్నర అక్రమాస్తులు కూడబెట్టిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.సంజీవరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం సిబ్బందితో సోమవారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, 400 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ. 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

09/23/2019 - 23:42

విఆర్‌పురం, సెప్టెంబర్: తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌పురం మండలం మొద్దులగూడెం జంక్షన్ సమీపంలో సోమవారం ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలావున్నాయి... ముత్యాల వెంకన్నబాబు (55), బాగుల సాయిబాబు (40) సోమవారం బైక్‌పై వీఆర్‌పురం నుండి పోచవరం వెళుతున్నారు.

09/24/2019 - 04:22

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించినంత మాత్రాన వారికి రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసే హక్కు కాదని ఎన్నికల కమిషన్ సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 15 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అనర్హ ఎమ్మెల్యేలకు పోటీ చేసే అవకాశం లేదా అన్న అంశం రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో సీఈసీ సుప్రీంకోర్టుకు ఈ వివరణ ఇచ్చింది.

09/23/2019 - 23:17

జమ్మూ, సెప్టెంబర్ 23: జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లాలో కరుడుగట్టిన ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు. వారిపై నాలుగు ఉగ్రవాద కేసులు, బీజేపీ నేత అలాగే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసుల్లో ఉన్నట్టు జమ్మూజోన్ ఐజీ ముఖేష్ సింగ్ తెలిపారు.

09/23/2019 - 04:14

తుంగతుర్తి, సెప్టెంబర్ 22: పలు సమస్యలతో సతమతమవ్వడమే కాకుండా సమాజంలో పరువుపోతోందనే ఆవేదనతో పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు తన భార్యా పిల్లలతో సహా అదృశ్యమైన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. సంచలనం కలిగించిన ఈ ఉదంతాన్ని ఛేదించేందుకు పోలీసుశాఖ రంగంలోకి దిగింది.

09/23/2019 - 02:18

పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 22: స్థానిక గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తుడు మునే్నటిలో స్నానానికి దిగి ఆదివారం గల్లంతు అయ్యాడు. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తెనాలి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన పఠాన్ గౌస్ (32) కొంత మంది స్నేహితులతో కలిసి ఆదివారం తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు.

09/23/2019 - 02:16

కూచిపూడి, సెప్టెంబర్ 22: వరుస దొంగతనాలతో మొవ్వ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెలలో మంత్రిపాలెం, పెదపూడి గ్రామాలలో జరిగిన దొంగతనాల చేదు అనుభవాలు మది నుండి తప్పపోకముందే ఆదివారం పెడసనగల్లు గ్రామంలో భారీ దొంగతనం జరగటంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసు శాఖ వైఫల్యంగా పలువురు విమర్శిస్తున్నారు.

09/23/2019 - 02:09

మచిలీపట్నం, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను అవనిగడ్డ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు మీడియా ముందు హాజరుపరిచారు.

09/23/2019 - 02:04

సనత్‌నగర్, సెప్టెంబర్ 22: నిత్యం జనసంద్రంగా ఉండే అమీర్‌పేట మెట్రోస్టేషన్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌ను అందంగా రూపొందించేందుకు చేసిన ప్లాస్టింగ్ పెచ్చులూడి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన నగర ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..

Pages