S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/30/2019 - 01:00

హైదరాబాద్: ఇంటర్మీడియట్ మూల్యాంకనానికి సంబంధించి బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం నాడు వాదనలు జరిగాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ఇరుపక్షాల వాదనలను విచారించింది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

04/30/2019 - 04:06

పాణ్యం: పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఓ గిరిజన ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లులో సోమవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన భరత్‌కుమార్ (20), పెద్దక్క (19) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

04/30/2019 - 04:05

తుని: తూర్పు గోదావరి - విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ప్రవహించే తాండవ నదిలో ఇసుక తవ్వుకునే ప్రయత్నంలో ఇసుక సొరంగం కుప్పకూలి సోమవారం ఇద్దరు వ్యక్తులు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ప్రమాదం సంభవించిన ప్రాంతం విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోకి వస్తుంది. బాధితులు తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణ శివారు ఉప్పరగూడెం ప్రాంతానికి చెందినవారు. వివరాలిలా వున్నాయి...

04/29/2019 - 01:49

భువనగిరి, ఏప్రిల్ 28: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్యకేసులో 11మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. గంజాయి మత్తులో వీరం తా ఆ అసహాయురాలిపై మృగా ల్లా సామూహిక అత్యా చారం జరిపి హతమార్చినట్లు తెలుస్తోం ది.

04/29/2019 - 01:46

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 28: జిల్లా వ్యాప్తం గా రైస్ మిల్లులపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న టాస్క్ ఫోర్స్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పీ. నాగాదుర్గా ప్రసాద్ తెలిపారు.

04/29/2019 - 01:39

కురబలకోట, ఏప్రిల్ 28: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళు సమీపంలో ఆదివారం భారీస్థాయిలో గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి నుంచి అనంతపురం జిల్లా కదిరికి తరలించే క్రమంలో పోలీసులకు వీరు పట్టుబడ్డారు. బొలెరో వాహనంలో పెళ్లి సామగ్రి ముసుగులో గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో వీరిని పోలీసులు పట్టుకున్నారు. మదనపల్లె రూరల్ సీఐ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

04/29/2019 - 04:33

విజయవాడ: సంచలనాలకు మారుపేరైన ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను విజయవాడ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం అరెస్ట్ చేశారు. ఆయన వచ్చిన విమానంలోనే గన్నవరం నుంచి తిరిగి వెనక్కి పంపించేశారు. ఈ సందర్భంగా ఉత్కంఠత, ఒక దశలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

04/28/2019 - 03:57

మంగళగిరి, ఏప్రిల్ 27: సినీనటుడు సుధాకర్ కారు ఢీకొని ఒక మహిళ మృతిచెందింది. ఈ ప్రమాదంలో సుధాకర్‌కు, ఆయన కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఆత్మకూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై డివైండర్ మధ్యలో మొక్కల పెంపకం పనుల్లో ఉన్న జలసూత్రం లక్ష్మి (36)ని హీరో సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ఢీకొని అనంతరం లారీని కూడా ఢీకొట్టింది.

04/28/2019 - 03:27

నిజాంసాగర్/నారాయణఖేడ్, ఏప్రిల్ 27: కామారెడ్డి-సంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని కల్హేర్ మండలం బాచెపల్లి గ్రామ శివారులో, 161వ నాందేడ్-సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారిపై, శనివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మృతి చెందారు. సిర్గాపూర్ ఎస్‌ఐ స్వామి కథనం ప్రకారం.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

04/28/2019 - 02:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: తమ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై కేసు నమోదు చేయాలని ఈస్ట్ ఢిల్లీ రిటర్నింగ్ అధికారిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఢిల్లీలోని జంగ్‌పురాలో గౌతమ్ గంభీర్ ఈనెల 25న ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.

Pages