S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/18/2018 - 21:01

టాలీవుడ్‌లో సినిమాలు అనగానే గ్లామర్ మాత్రమే అడుగుతున్నారు అంటూ క్లాసులు పీకేసి.. బాలీవుడ్‌లో ఒక మ్యాగజైన్ కవర్ అనగానే ఏకంగా బికినీల్లో, బ్రాలలో, అండర్‌వేర్‌ల్లో కూడా ఫోజులు ఇచ్చేసిన రకుల్ ప్రీత్‌సింగ్‌పై ప్రశంసల కంటే క్రిటిసిజం ఎక్కువగా వినిపించింది. ఆమె తెలుగు సినిమాలను కాస్త చులకనగా చూడటం వలన.. వెంటనే ఇక్కడనుండి చాలామంది పంచులు వేసేశారు. అవన్నీ రకుల్ చెవిన కూడా పడ్డాయి.

02/18/2018 - 20:59

ఈమధ్య తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పలువురు సినీ తారలు రాజకీయ ప్రవేశం చేస్తూ రాజకీయాలకు గ్లామర్‌ను అద్దుతున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్, జాతీయ నటుడు కమల్‌హాసన్‌లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మరో హీరో విశాల్ కూడా ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మరో హీరో వస్తున్నాడంటూ కోలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.

02/18/2018 - 20:57

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా వచ్చే వారంలో రెండో షెడ్యూల్ మొదలుకానుంది. సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, అమితాబ్, జగపతిబాబు లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. భారీ ప్రతిష్ఠాత్మకంగా మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీత సంచలనం రెహమాన్ సంగీతం అందిస్తారని యూనిట్ పేర్కొంది.

02/18/2018 - 20:55

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ లావణ్య త్రిపాఠి. ఆ చిత్రంతో ఆమె ఎంతోమంది కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిన మాట వాస్తవం. ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లకుండానే ఆమె కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది.

02/18/2018 - 20:53

‘ప్రియా ప్రకాశ్ వారియర్’.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ పేరే వినిపిస్తోంది. ఆమె ఓవర్‌నైట్‌లో అంతలా పాపులర్ అయిపోయింది మరి. ఎంతగా అంటే... చివరకు పోర్న్ సుందరి సన్నీ లియోన్‌ను కూడా క్రాస్ చేసేటంతగా. అవును.. నిజంగానే. గత రెండు మూడు రోజులుగా గూగుల్‌లో అత్యధికంగా శోధిస్తున్న పేరు ప్రియా ప్రకాశ్‌దేనట. ఆ రకంగా సన్నీని ఆమె పక్కకు నెట్టేసింది.

02/18/2018 - 20:51

అందమైన అమ్మాయి చిక్కినా.. బొద్దుగా వున్నా అందమే అంటారు పెద్దలు. అవును అచ్చంగా ఈ అమ్మడిని చూస్తే అలాగే అనిపిస్తుంది. తెలుగు పిల్ల అంజలి ఈమధ్య సన్నబడేందుకు తెగ కసరత్తులు చేస్తోంది ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు కాబట్టి.. అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న ఈ అమ్మడు, ఇక సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అందుకే సన్నబడింది.

02/18/2018 - 20:49

ఈ మధ్య టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ రాశీఖన్నా వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా ‘తొలిప్రేమ’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు ఘాటు లిప్‌లాక్ కూడా ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ సినిమా కోసం నితిన్‌తో జోడీ కట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం నితిన్ ‘్ఛల్ మోహన్ రంగ’ సినిమాలో నటిస్తున్నాడు.

02/16/2018 - 21:27

మొత్తానికి గ్లామర్ భామ శృతిహాసన్ వ్యవహారం చూస్తుంటే సినిమాలకు ఫల్‌స్టాప్ పెట్టేలా కన్పిస్తోంది. ఈ మధ్య ఎన్ని అవకాశాలు వస్తున్నా కూడా నో చెబుతోంది. ప్రస్తుతం కమల్‌హాసన్ నటిస్తున్న శభాష్ నాయుడు సినిమా ఒక్కటే చేసింది. దాదాపు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్న ఈ అమ్మడు ఈ విషయంపై స్పందిస్తూ.. ఈమధ్య సినిమాలు చేయడం లేదని అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం ఒక్కటే.. నా జీవితంలో సినిమాలే కాదు..

02/16/2018 - 21:26

మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ సభ్యులు, హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు వెంకీ, నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడులను హైదరాబాద్‌లోని తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.

02/16/2018 - 21:22

సంతోషం, వెంకీ, ఢీ, దూకుడు లాంటి పలు సూపర్‌హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన గోపీమోహన్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. కొద్దికాలంగా దర్శకుడిగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టిన గోపీమోహన్, ప్రస్తుతం తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. ‘ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా’ అన్న సాప్ట్ టైటిల్‌తో గోపీమోహన్ దర్శకుడిగా మారబోతున్నారు.

Pages