S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/14/2018 - 21:24

చరణ్ ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ తన శైలిలో తెరకెక్కించిన సినిమాలో సమంత హీయిన్‌గా నటించింది. అనసూయ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

02/14/2018 - 21:23

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

02/13/2018 - 21:13

ప్రేమ.. అదో మధురమైన అనుభూతి.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ప్రేమగురించి తెలుసుకోవాలంటే ప్రేమలో
పడితేనే సాధ్యమని అంటాడొక మహానుభావుడు. నిజమే! తరాలు మారినా. కాలాలు మారినా ప్రేమ మారదు..
ప్రేమించే మనుషులు మారొచ్చు కాని ప్రేమ ఎప్పటికీ అజరామరం. అందుకే సినిమాకు ప్రేమే కొలమానం..
*

02/12/2018 - 22:38

టాలీవుడ్‌లో బ్యూటీగాళ్‌గా యమ క్రేజ్‌ని సంపాదించుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా క్రేజీ హీరోలందరితో ఆడిపాడింది. లభించిన చిత్రాల్లో పోషించిన పాత్రల ద్వారా గ్లామర్ చిందించడంలోనూ తను ముందు వరుసలోనే వుంది. చిత్రసీమలో ఏ హీరోయిన్ అయినా అన్ని రకాల పాత్రలు పోషించినప్పుడే కొంత కాలం వెలుగు.

02/12/2018 - 22:35

రామ్‌చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం ‘రంగస్థలం’. స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మాతలు ఈ ప్రెస్టేజియస్ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, హీరోయిన్ సమంతలకు సంబంధించిన టీజర్స్‌ను విడుదల చేశారు.

02/12/2018 - 22:32

రోజురోజుకు ఎన్ని కొత్త కథలతో, నటులతో చలనచిత్రాలు వచ్చినా కుటుంబ కథా చిత్రాలకు మోజు ఎప్పటికీ తగ్గదు. పిల్లలు, పెద్దలు, యుక్త వయస్కులు ఎవరినైనా రెండున్నర గంటలు కూర్చోబెట్టి ప్రశాంతంగా చూసేలా చేస్తాయి. కుటుంబ కథాచిత్రాలకు ఎక్కువ మధ్యతరగతి ప్రజలే అభిమానులు.

02/12/2018 - 22:29

తెలుగు సినిమాల సరిహద్దులు ఏనాడో చెరిగిపోయాయి. మనదగ్గర కలెక్షన్ల వర్షం ఎంత కురుస్తుందో ఓవర్‌సీస్‌లోనూ అలాగే ఓవర్‌ఫ్లో అవుతోంది. వసుదైక కుటుంబం అయిన ఈ తరుణంలో తెలుగు చిత్రాల్లో విదేశీ నటులు కూడా ఆరుదుగా సందడి చేస్తున్నారు. తాజాగా సూపర్ స్కెచ్‌లోనూ విదేశీ తారాగణం కనిపించనుంది. మైండ్ గేమ్ కానె్సప్టుతో రూపొందుతున్న చిత్రమిది. రవికుమార్ చావలి దర్వకత్వం వహిస్తున్నారు.

02/12/2018 - 22:41

రంజిత్, పాలక్ లల్వాని జంటగా సోమి ఫిలిమ్స్ పతాకంపై భరత్ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. ఈ చిత్రం ఆడియో విడుదలైంది. బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి ఝాన్సీ అతిథులుగా హాజరైన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, అడివి శేష్, హాస్యనటులు అలీ, సప్తగిరి, భద్రమ్, చిత్ర దర్శకుడు త్రికోటి, మాటల రచయిత రత్నం, మలయాళ నటుడు అర్జున తదితరులు పాల్గొన్నారు.

02/12/2018 - 22:27

బాలీవుడ్ సంచలన చిత్రం దీపికా పదుకొనె నటించిన పద్మావతి సినిమాకు ఎన్ని అడ్డకులు ఎదురయ్యాయో అందరికీ తెలుసు. అన్ని అడ్డంకులను దాటుకుని సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది ఈ చిత్రం. ఇప్పుడు అ తరహాలో బాలీవుడ్‌లో రూపొందుతున్న మణికర్ణిక సినిమాపై విమర్శలు వస్తున్నాయి. కంగనా రనౌత్ ముఖ్యపాత్రలో తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ కథతో తెరకెక్కిస్తున్నారు.

02/11/2018 - 21:12

టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ తాజాగా ఓ మ్యాగజిన్ కోసం ఇచ్చిన ఫొటో షూట్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఇన్నాళ్లు అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిచిన ఈ చిన్నదేనా ఇంత ఘాటు లేపింది అని! ఎందుకంటే ఈ అమ్మడు రేపిన ఘాటు ఆ రేంజ్‌లో ఉంది మరి. కేవలం టూ పీస్‌తో బికినీలా అన్పిస్తున్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Pages