S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/31/2017 - 21:22

ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం ఫ్యానీఖాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తికాకముందే మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇం దులో ఒకటి నర్గీస్ ద్విపాత్రాభినయం చేసిన రాత్ ఔర్ దిన్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్నది. కల్ట్ క్లాసిక్ జోనర్‌లో రూపొందించిన ఆ చిత్రంలో నర్గీస్ చేసిన ద్విపాత్రాభినయం ఐష్ ఈ చిత్రంలో చేయనున్నది. అయితే ఈ సినిమాలో నటించడానికి ఉద్వేగంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది ఐష్.

12/31/2017 - 21:20

సినిమా రంగం ఓ రంగులకల. కొందరినీ అందరమెక్కిస్తే మరికొందరిని అధఃపాతాళానికి తొక్కివేస్తుంది. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడిని అక్షరాల పాటించే నటులు కొంతవరకు బాగానే వున్నారు. మరికొంతమంది పూటకు గడవని స్థితిలో తనువు చాలించిన వారెందరో మన కళ్ళముందే కనుమరుగయ్యారు.

12/30/2017 - 20:28

రవితేజ, రాశీఖన్నా, సీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ రూపొందిస్తున్న చిత్రం టచ్‌చేసి చూడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

12/30/2017 - 20:27

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న రానా తమిళ సినిమాలపైనా దృష్టి పెట్టారు. పలువురు తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. బాలా దర్శకత్వంలో ఓ పిరియాడికల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం కొంత ఆలస్యం కానున్నదట. తమిళ చిత్రంతో బిజీగా వున్న బాల సినిమా పూర్తయ్యాక రానాతో మొదలుపెట్టనున్నారు.

12/30/2017 - 20:26

తేజ దర్శకత్వంలో వెంకటేష్ ఒక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు. జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. చివరికి చెలియా చిత్రంతో పరిచయమైన అతిథిరావు హైదరీను ఎంపిక చేసారట. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈ భామ కథ వినగానే ఓకే చెప్పిందట.

12/30/2017 - 20:24

అఖిల్ కథానాయకుడిగా రూపొందిన హలో.. చిత్రం నేను చేసిన 50వ చిత్రం అవడం, అది పెద్ద విజయం సాధించడం ఆనందంగా వుందని సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందించిన ఈ చిత్ర విశేషాలు అనూప్ వివరించారు. ‘‘పరిశ్రమకు వస్తానని ఏనాడూ అనుకోలేదు. కీబోర్డు ప్లేయర్‌గా పనిచేసిన నాకు మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ లేదు.

12/30/2017 - 20:22

బాలీవుడ్ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ ఓ సంచలన చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటిస్తోంది.

12/30/2017 - 20:21

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదిత్య భరద్వాజ్ అనే దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ హిందీ భాషల్లో నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ముంబైలోనే జరగనున్నది.

12/30/2017 - 20:20

ప్రసాద్ లక్కన, లీనా జంటగా సంచలన్ ఫిలింస్ పతాకంపై ప్రసాద్ లక్కన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అమ్మాయి గోల శ్రీకృష్ణలీల’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను గురువారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించారు.

12/30/2017 - 20:18

శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా శివమ్ సెల్యులాయిడ్స్ మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై జె.బి.మురళీకృష్ణ దర్శకత్వంలో జోజో జోస్, శ్రీనివాసరెడ్డి రూపొందిస్తున్న చిత్రం జంబలకిడిపంబ. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈస్ట్ గోదావరి, వైజాగ్, అరకు, కేరళలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నది.

Pages