S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2017 - 20:38

సప్తగిరి హీరోగా సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ రూపొందించిన తాజా చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. హిందీలో విజయవంతమైన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 7న విడుదలకు సిద్ధం చేశారు.

11/22/2017 - 20:37

మహీధర్, ఇషిత, ప్రశాంత్, లలిత ప్రధాన తారాగణంగా లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై శివసాయి సమర్పణలో వెంకటేష్.కె దర్శకత్వంలో ప్రశ్నాద్ తాత రూపొందించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 24న విడుదల చేయనున్నారు.

11/22/2017 - 20:34

గతంలో ఎంతమంది మహిళా నిర్మాతలు వచ్చారో తెలియదు. కానీ ఈ సినిమాను ఇష్టపడి కష్టమైనా చేశాను. ఓ రకంగా నటించడం చాలా ఇబ్బందికరమైన విషయమే అని నటి జయతి తెలిపారు. గెడ్డం జయతి నటిస్తూ నిర్మించిన చిత్రం ‘లచ్చి’. ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమైంది.

11/22/2017 - 20:32

ఆనంద్ రవి కథానాయకుడిగా ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కానె్సప్ట్ పతాకాలపై ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త మడుపల్లి రూపొందించిన చిత్రం ‘నెపోలియన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 24న విడుదల చేయనున్నారు.

11/22/2017 - 20:31

బాలీవుడ్ నటి జరీన్‌ఖాన్‌పై ఓ సినిమా షూటింగ్ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తించారట. ఆ సినిమా దర్శకుడు ముందు తనకు చెప్పింది ఒకటని, ఆ తర్వాత అతను చేసింది మరొకటని జరీన్‌ఖాన్ చెబుతోంది. సినిమా విషయంలో తనకు ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయాలని డిమాండ్ చేశారని, నిజానికి ఆ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేకున్నా ఖచ్చితంగా గ్లామర్ ఆరబోయాలని డిమాండ్ చేశారని చెబుతోంది.

11/22/2017 - 20:30

బాధ్యతాయుతమైన పదవి అయిన బిజెపి ఎంపీగా వుండి ‘పద్మావతి’ సినిమా గురించి నచ్చకపోతే ఆ సినిమాపై వ్యాఖ్యలు చేయాలి కానీ, సినిమా పరిశ్రమ మొత్తాన్ని తప్పుపట్టి మాట్లాడడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని టి.ఎఫ్.సి.సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. పద్మావతి సినిమాకు వున్న వివాదాలు మరే సినిమాకు చుట్టుకోలేదేమో.

11/22/2017 - 20:28

ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత గత ఐదేళ్లుగా నంది అవార్డుల ఊసే లేదు. 2012, 2013 సంవత్సరాలకు ఒకేసారి ఏడాది మార్చి మొదటి వారంలో ‘నంది’ పురస్కారాలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మలి దశలో 2014, 2015, 2016 సంవత్సరాలకు ముచ్చటగా మూడేళ్ల నందులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డులపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

11/21/2017 - 20:06

పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది అదిరిపోయే న్యూస్. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కాటమరాయుడా అంటూ పాడిన పవన్‌కళ్యాణ్ మరోమారు ఫ్యాన్స్‌ను అలరించబోతున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ‘కొడకా.. కోటేశ్వరా’ అంటూ పవన్ కళ్యాణ్ తన గొంతు వినిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈవార్త ఫిలింనగర్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.

11/21/2017 - 20:04

‘రాజా ది గ్రేట్’ సినిమా తరువాత రవితేజ చేస్తోన్న సినిమా ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

11/21/2017 - 20:02

గత ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమా నిర్మాతల మండలి సభ్యులు కోరిన విధంగా ప్రస్తుతం వున్న కార్యవర్గాన్ని రద్దుచేశారు. గత ఆదివారం జరిగిన 17వ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ప్రస్తుతం వున్న కార్యవర్గాన్ని తక్షణమే రద్దుచేసి వెంటనే అడ్‌హాక్ కమిటీని ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తీర్మానించడమైనదని ప్రకటించారు.

Pages