S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/27/2016 - 21:17

మోహన్‌లాల్, ప్రియదర్శన్ కలయికలో మళయాలంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంచలనం సృష్టించిన ‘ఒప్పమ్’ ఇప్పటివరకు 50 కోట్లు వసూలు చేసింది. ఒప్పమ్ కథ విషయానికి వస్తే- ఇందులో మోహన్‌లాల్ అంధుడిగా నటించారు. మోహన్‌లాల్ ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఆపరేటర్. ఒక రోజు ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ హత్య చేసి హంతకుడు తప్పించుకుంటాడు.

12/27/2016 - 21:14

రామ్‌కార్తిక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం ‘మామ..ఓ.. చందమామ’. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ 11న పసలపూడిలో ప్రారంభించారు.

12/27/2016 - 21:13

దర్శకుడు బాల తమిళంలో నిర్మించిన ‘చండివీరన్’ తెలుగులో ‘కాళి’ పేరుతో అనువాదమవుతోంది. బి స్టూడియోస్ పతాకంపై దర్శకుడు బాల తెలుగులో సమర్పిస్తున్నారు. అధర్వ, ఆనంది, లాల్ కీలక పాత్రల్లో నటించారు. శర్కునమ్ దర్శకత్వం వహించారు. దీన్ని లక్ష్మీ వెంకటేశ్వరా మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత ఎం.ఎం.ఆర్. మాట్లాడుతూ-‘్ఫక్తు పల్లెటూరు చిత్రమిది.

12/25/2016 - 21:11

‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదలవుతున్న సందర్భంగా ఇప్పటికే టీజర్లు, మేకింగ్ వీడియో సహా ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ ఆడియో సాంగ్‌కి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రకటించారు.

12/25/2016 - 21:10

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మన హీరోల సినిమా షూటింగ్‌లు మొదలైతే చాలు అభిమానులు తెగ ఊహించేసుకుంటుంటారు. ఎన్టీఆర్, బాబి కాంబినేషన్‌తో సినిమా నిర్మాణం ప్రారంభమైందో లేదో అప్పుడే ఆ సినిమా టైటిల్‌పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

12/25/2016 - 21:08

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన తారాగణంగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

12/25/2016 - 21:06

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించే భారీ బడ్జెట్ చిత్రాల తెలుగు హక్కులను దక్కించుకుంటున్న డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ మరో సినిమాకు హక్కులను సొంతం చేసుకున్నారు. వరుస హిట్లతో దూకుడు మీదున్న తమిళ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

12/25/2016 - 21:04

రవి దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన చిత్రం తరకప్పు. ఈ చిత్రాన్ని వై.శేషిరెడ్డి సమర్పణలో వి.జె.వై.ఎస్.ఆర్. పతాకంపై తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ అనే పేరుతో అందిస్తున్నారు. శక్తివేల్‌వాసు, సుముద్ర ఖని, వైశాలి, రియాజ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

12/25/2016 - 21:02

రోడ్డుమీద మోటారు వాహనం నడపాలంటే కచ్చితంగా లైసెన్స్ కావాలి. మనం ఎలాంటి ఉత్పత్తులను అమ్మాలన్నా లైసెన్స్ తప్పనిసరి. అలాంటిది పిల్లలను కనడానికి కూడా లైసెన్స్ ఉండాల్సిందేనని అంటోంది ఓ హీరోయిన్! ఆమె కామెంట్స్‌తో జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ మాటలు అన్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమధ్య ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ సంజన.

12/25/2016 - 21:01

హాలీవుడ్ సిరీస్ క్వాంటికోతో గ్లోబల్ స్టార్‌గా ఒక రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ సుందరి ప్రియాంకాచోప్రా ‘బేవాచ్’ని త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆమె ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రమోషన్ చేస్తోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన అనేక ప్రశ్నలకి ఆమె సమాధానాలిచ్చింది. గ్లోబర్ స్టార్‌గా ఎదిగి తిరిగి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవాళ్ల ప్రవర్తనలో ఏదైనా మార్పును గమనించారా?

Pages