S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/09/2016 - 20:49

‘నినే్న పెళ్ళాడతా’ అంటూ నాగచైతన్య వెంట పడబోయే హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. సమంత, తమన్నాలాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించినా చివరికి ఆ ప్లేస్‌లో రకుల్ ఖాయమైంది. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. నాగ్ నటించిన ‘నినే్న పెళ్లాడతా’ తరహా స్క్రిప్టుని కళ్యాణ్ సిద్ధం చేశారట.

09/08/2016 - 21:16

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెం.150. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని గత నెల్లో విడుదలైన ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఉన్న అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి.

09/08/2016 - 21:14

శింబు నటిస్తున్న తాజా చిత్రం ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’. ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీయ నటిస్తుంది. ఇప్పుడు తమన్నా కూడా ఈ చిత్రంలో నటిస్తుందట. శింబుతో తమన్నాకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో శ్రీయ, తమన్నాతోపాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఇక తమన్నా క్యారెక్టర్ విషయానికి వస్తే- ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్‌కి తమన్నా క్యారెక్టరే కారణం.

09/08/2016 - 21:13

దర్శక ధీరుడు రాజవౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి- ది బిగినింగ్’ విడుదలై ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. అయినా ఆ చిత్రం యొక్క హడావుడి ఇంకా కనిపిస్తూనే వుంది. ఇప్పటివరకూ భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమైన రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం తాజాగా ప్రముఖ వెబ్‌సైట్ ‘స్క్రీన్ రాంట్’ ప్రచురించిన 15 ఫారిన్ బ్లాక్‌బస్టర్స్ లిస్టులో 12వ స్థానం పొంది మరో అరుదైన ఫీట్‌ను సాధించింది.

09/08/2016 - 21:11

నితిన్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సంస్థ కార్యాలయంలో గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, ఎన్.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా తమ సంస్థ తరఫున తొమ్మిదవ చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

09/08/2016 - 21:09

ఈమధ్య వరుస పరాజయాలు ఎదురుకావడంతో కాస్త గ్యాప్ తీసుకుని ‘జక్కన్న’తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సునీల్‌కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. ఇక ఈ సినిమాతోపాటు ‘ఈడు గోల్డ్‌ఎహే’ సినిమాలో నటిస్తున్న సునీల్, ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడుట. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి, ఈ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు.

09/08/2016 - 21:07

అందరూ నూతన నటీనటులతో అంజన్ కళ్యాణ్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో అంజన్ కె.కళ్యాణ్ రూపొందించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా అంజన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హారర్ కామెడీ జోనర్‌లో సరికొత్త కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.

09/08/2016 - 21:06

విజయ్‌చందర్ సాయిబాబాగా నటించిన సాయే దైవం చిత్రం దసరా కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. ఓం సాయిప్రకాష్, చంద్రమోహన్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు జి.ఎల్.బి.శ్రీనివాస్. సినిమాకు సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు.

09/08/2016 - 21:05

కన్నడంలో విజయవంతమైన విష్ణువర్థన చిత్రాన్ని హాపీ మూవీస్ పతాకంపై శే్వతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు తెలుగులో ‘హలో బాస్’గా అనువదిస్తున్నారు. సుదీప్, సోను సూద్, ప్రియమణి ప్రధాన తారాగణంగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

09/08/2016 - 21:03

బాలీవుడ్ బయోపిక్స్ హవా మామూలుగా లేదు. ఇప్పటికే ఈ తరహా సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. పైగా స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తిని కూడా చూపిస్తున్నారు. దాంతోపాటు ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంటూ ఉండటంతో, ఇప్పుడు చరిత్ర క్రియేట్ చేసిన వారి జీవిత కథల గురించి జోరుగా అనే్వషణలు జరుగుతున్నాయి.

Pages