S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/14/2016 - 00:53

క్రేజీ దర్శకుడిగా దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న మణిరత్నం ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకందించాడు. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతమున్న యంగ్ హీరోల్లో కూడా చాలామంది ఆయనతో సినిమా చేయాలని ఆరాటపడుతుంటారు. అలాంటి గొప్ప అవకాశం ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు దక్కిందని తెలుస్తోంది.

09/14/2016 - 00:51

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీయా శర్మలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీమ్‌వర్క్స్ పతాకాలపై నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘నిర్మలా కానె్వంట్’. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 16న విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్ శ్రీయా శర్మతో చిట్ చాట్...
* మీ గురించి?

09/14/2016 - 00:49

సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘సిద్ధార్థ’ సెప్టెంబర్ 16న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో సాగర్ చెప్పిన విశేషాలు..

09/14/2016 - 00:47

సునీల్ కథానాయకుడుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ..

09/14/2016 - 00:45

‘జనతా గ్యారేజ్’ హిట్‌తో మంచి జోరుమీదున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే ఆయనతో సినిమా చేయాలని పలువురు దర్శకులు కథలను సిద్ధం చేసుకుని ఆయనకు వినిపించే పనిలో ఉన్నారు. మొదట దర్శకుడు పూరీ జగన్నాథ్ తారక్‌కు ఓ కథ చెప్పాడని, కానీ అది పూర్తి స్థాయిలో చెప్పలేదని, ‘ఇజం’ పనులు పూర్తయ్యాక మిగతా సగం చెబుతాడని, అప్పుడు తారక్‌కు నచ్చితే ఆ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని తెలుస్తోంది.

09/14/2016 - 00:44

‘బిచ్చగాడు’ చిత్రాన్ని అందించిన నిర్మాతలు తాజాగా మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని పిల్ల రాక్షసిగా అనువాదం చేస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న ఈ చిత్రం మలయాళంలో ఆన్ మరియ కలిప్పిలాను చిత్రానికి పిల్లరాక్షసిగా పేరును ఖరారు చేశారు.

09/14/2016 - 00:42

తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బెంగుళూరులో ఇటీవల ఏర్పాటైన ఓ కార్యక్రమంలో 2016 సంవత్సరానికిగాను శ్రీకృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానం కనుల పండువగా జరిగింది. డైలాగ్‌కింగ్ సాయికుమార్, ప్రముఖ సాహితీవేత్త డా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ నటి జయప్రద, కన్నడ సాహితీ దిగ్గజం డా బరగూరు రామచంద్రప్పలకు శ్రీకృష్ణదేవరాయల పురస్కారాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రదానం చేసి అభినందించారు.

09/14/2016 - 00:40

షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై ఖయ్యూం, నందినీ కపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ తాటి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీ గేమ్’. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

09/14/2016 - 00:40

‘సరైనోడు’ సూపర్‌హిట్ తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘డి.జె- దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకుంది. ఇప్పుడు, ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఇప్పటివరకు తీవ్రమైన చర్చ జరిగింది. మొదట పూజా హెగ్డేతో చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఆమె కాదని కాజల్ అగర్వాల్‌ను ఫిక్స్ చేశారని బలమైన ఊహాగానాలు వినిపించాయి.

09/14/2016 - 00:37

రామ్‌శంకర్, నికీషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేక బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్క సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి రాహుల్‌రాజ్, వాసుదేవ్ అందించిన సంగీతం హైదరాబాద్‌లో విడుదల చేశారు. థియేటర్ ట్రైలర్‌లను హీరో కళ్యాణ్‌రామ్ విడుదల చేయగా, ఆడియో సీడీని పూరీ జగన్నాథ్ ఆవిష్కరించారు.

Pages