S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/08/2016 - 21:02

నిఖిల్‌కుమార్ కథానాయకుడిగా చెన్నాంబికా ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దసరా కానుకగా అక్టోబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

09/08/2016 - 03:48

టాలీవుడ్‌లో తక్కువ సినిమాలతో హీరోయిన్‌గా ముఖ్యంగా నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది అందాల భామ నిత్యామీనన్. ఇప్పటికే ఈమె చేసిన సినిమాల్లో నటిగా మంచి మార్కులే తెచ్చుకుంది. లేటెస్ట్‌గా ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కూడా నిత్యాకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఈమెకు క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. ఈ కోవలో మెగా హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ధ్రువ’ చిత్రంలో నటిస్తున్నాడు.

09/08/2016 - 03:46

‘జనతా గ్యారేజ్’ విజయంతో మంచి ఊపుమీదున్నాడు ఎన్టీఆర్. వరుస పరాజయాల తరువాత ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, జనతా గ్యారేజ్’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఈ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే రచయిత వక్కంతం వంశీతో సినిమా చేయాలని ప్లాన్ చేసాడు. కానీ వంశీ చెప్పిన కథ నచ్చకపోవడమో, లేక వంశీకి దర్శకుడిగా అనుభవం లేకపోవడంతో ఈ సినిమా చెయొద్దనే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్.

09/08/2016 - 03:45

హీరోలుగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని మరోవైపు దర్శకులుగా ప్రూవ్ చేసుకున్న హీరోలు చాలా అరుదని చెప్పొచ్చు. ఇప్పుడు అదే కోవలో మరో తమిళ స్టార్ హీరో దర్శకుడిగా మారడానికి రెడీ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే.. జాతీయ అవార్డు అందుకున్న నటుడు ధనుష్ కోలీవుడ్‌లో బిగ్ స్టార్. ఇప్పటికే అటు బాలీవుడ్‌లో కూడా నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోగా చేస్తున్న ధనుష్, నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు.

09/08/2016 - 03:44

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. పతాకంపై రూపొందిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించిన షూటింగ్ మధ్యప్రదేశ్‌లో శరవేగంగా సాగుతోంది. బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయ, పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈనెల 6వ తేదీనుండి రాజసూయ యాగానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

09/08/2016 - 03:43

నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ రూపొందిస్తున్న ‘ఇజం’ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు తెలియజేశారు. టీజర్ విడుదలైన 48 గంటలలోపే ఒక మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెనే్సషన్ క్రియేట్ చేసిందని, ఈ చిత్రంలోని కల్యాణ్‌రామ్ లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.

09/08/2016 - 03:42

తమిళ స్టార్ హీరో సూర్య తన ఇమేజ్‌కి తగ్గ హిట్‌కోసం ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే విడుదలైన ‘24’ తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్‌గానే నిలిచినా, సూర్య స్థాయికి తగ్గ విజయంగా మాత్రం నిలవలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కొత్త సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘సింగం 3’ అనే పక్కా మాస్ కమర్షియల్ సినిమా ఈ దీపావళికి విడుదల కానుండగా, అప్పుడే తన తదుపరి సినిమాను కూడా ప్రకటించేశారాయన.

09/08/2016 - 03:40

అక్కినేని నాగార్జున హీరోగా ‘ఓం నమో వేంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

09/07/2016 - 22:46

నాగార్జున హీరోగా వచ్చిన ‘నినే్న పెళ్ళాడతా’ సినిమా అప్పట్లో సంచలన విజయం క్రియేట్ చేసి బాక్స్‌ఆఫీసును రఫ్ ఆడించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టైటిల్ ఇప్పుడు రిపీట్ కానుంది? ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘ప్రేమమ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఇక దసరాకు సినిమా విడుదల చేస్తున్నారు.

09/07/2016 - 22:44

నిఖిల్ కథానాయకుడిగా ఐ.వి.ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్కడికి పోతావు చినవాడా’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిక్‌మంగళూరులో చివరి షెడ్యూల్ జరుపుతున్నారు. ఈనెల 12కి షూటింగ్‌పూర్తికానుంది. అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Pages