S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/12/2016 - 21:00

జై,అంజలి జంటగా నటించిన హిట్ సినిమా ‘జర్నీ’ తరువాత మళ్లీ ఆ ఇద్దరి కాంబినేషన్‌లో 70 ఎంఎం ఫిలింస్ పతాకంపై టి.ఎన్.అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ నిర్మిస్తున్న ‘బెలూన్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగినీడు ప్రధాన విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వి.రామచంద్రరావు మనవడు దర్శకుడు.

08/12/2016 - 20:59

రాజీవ్ సాలూరి కథానాయకుడిగా వెనె్నల క్రియేషన్స్ పతాకంపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో బలగ ప్రకాశ్ రూపొందిస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కేటుగాడు చిత్రంతో గుర్తింపు పొందిన కిట్టు మాట్లాడుతూ, ఓ వైవిధ్యమైన కథనంతో ఈ సినిమా వచ్చేనెలలో లాంఛనంగా ప్రారంభం కానుందని, త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

08/12/2016 - 20:57

ప్రముఖ నటుడు వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమాతో సక్సెస్‌ఫుల్ దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీప్రియ- ఇప్పుడు మరో చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టింది. సన్ మూన్ క్రియేషన్స్ పతాకంపై వి.ఆర్.కృష్ణ.ఎం. నిర్మించే ఈ చిత్రానికి ‘ఘటన’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

08/12/2016 - 20:55

క్రేజీ హీరోయిన్ శృతిహసన్ ఈమధ్య సినిమాలు బాగా తగ్గించుకుంది. ‘శ్రీమంతుడు’ తరువాత ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో ఆమె కూడా చేయలేదు. ప్రస్తుతం పవన్ సరసన కడప కింగ్ చిత్రంలో నటిస్తోన్న ఈమె, ఇప్పుడు మరో సినిమాకు ఓకె చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కమల్‌హసన్ నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ సినిమాలో నటిస్తోంది.

08/12/2016 - 20:53

విక్రమ్, నయనతార జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇంకొక్కడు’. తమిళంలో ‘ఇరుమగన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్.కె.్ఫలింస్ పతాకంపై నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

08/12/2016 - 20:49

‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో హిట్ అందుకున్న మంచు విష్ణు హీరోగా మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. గీతాంజలితో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లక్కున్నోడు’ అనే టైటిల్‌ను ఓకె చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ వివరాలు తెలియజేస్తూ, ‘మంచు విష్ణు మా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా వుంది.

08/11/2016 - 21:08

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తన రెండో సినిమాతోనే సత్తా నిరూపించుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తిక్క’. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై రోహన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలకు సిద్ధమైంది. లారిస్సా బొనేసి, మన్నారా చోప్రాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘తిక్క’ విడుదలవుతున్న సందర్భంగా సాయిధరమ్ చెప్పిన విశేషాలు...

08/11/2016 - 21:06

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ పెళ్లి వేడుకల కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ చిత్రంపై దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ, చిత్రం దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని, ఈ చిత్రం కచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు.

08/11/2016 - 21:05

‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ల దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి ఆ మధ్య అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇద్దరూ ఖరారు చేస్తూ, తమ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలియజేశారు. అయితే- ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

08/11/2016 - 21:03

సినీ థియేటర్ల షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమాల్ని ప్రోత్సహించేందుకు ఈ నెలాఖరునుంచి థియేటర్లలో ఐదు ఆటలకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్దినేని రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Pages