S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/17/2016 - 21:02

‘చైతు, అఖిల్ గెస్ట్‌రోల్ చేస్తామని చెప్పినపుడు ఎగ్జైట్ అయ్యా’ అని అంటున్నాడు హీరో సుశాంత్. సుశాంత్, సోనమ్ బజ్వా జంటగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదలవుతున్న సందర్భంగా హీరో సుశాంత్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ

08/17/2016 - 20:59

విజయ్ దేవరకొండ, రీతువర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్‌కందుకూరి నిర్మించిన ‘పెళ్లిచూపులు’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. చిన్నచిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఐటి శాఖా మంత్రి కెటిఆర్ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు.

08/17/2016 - 20:57

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిన ‘బాహుబలి’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజవౌళి దర్శకత్వంలో ‘ది కంక్లూజన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాల్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమాను అంతే భారీగా రూపొందిస్తున్నారు.

08/17/2016 - 20:55

ఆది, నమితా ప్రమోద్ జంటగా ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీఐశ్వర్య లక్ష్మి పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చుట్టాలబ్బాయి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్‌తో ఇంటర్వ్యూ...
చుట్టాలబ్బాయి ఏం చేస్తాడు?

08/17/2016 - 20:52

శేఖర్, యాచమిని, చందు ప్రధాన పాత్రల్లో తారకరత్న కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎవరు’. రమణ సెల్వ దర్శకత్వంలో క్రాంతి చిత్ర పతాకంపై ముప్పా అంకమ్మ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారా రోహిత్ మాట్లాడుతూ, ట్రైలర్ బాగుందని, తారకరత్నకు ఈ సినిమాతో మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నానన్నారు.

08/17/2016 - 20:50

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యాజైస్వాల్. ప్రస్తుతం ప్రముఖ నటుడు నాగార్జున నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో నటిస్తున్న ఈమెకు మరోసారి మెగా హీరో సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్-రెజీనా జంటగా నటిస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో సాయిధరమ్ ప్రత్యేక పాత్రలో కన్పిస్తున్నాడు.

08/17/2016 - 20:49

యాదాద్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చందన్, ఆనంది, ప్రభు ప్రధాన పాత్రల్లో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కయల్’ చిత్రాన్ని ‘తొలిప్రేమలో’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాతలు తమటం శ్రీనివాస్, జయారపు రామకృష్ణ. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలనే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను ఏర్పాటుచేశారు.

08/17/2016 - 20:47

వెంకటేష్‌గౌడ్, మల్లేశ్‌యాదవ్, ప్రాచీ అధికారి, కులకర్ణి మమత ముఖ్యపాత్రల్లో రమేష్ అంకం దర్శకత్వంలో శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై సి.వెంకటేష్‌గౌడ్, బి.మ ల్లేశ్ యాదవ్ నిర్మిస్తున్న ‘సుడిగాలి’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆర్.కె.గౌడ్ క్లాప్‌నిచ్చారు.

08/16/2016 - 21:21

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా బుధవారం నుంచి పవన్ పాల్గొంటున్నాడు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ పరాజయం తర్వాత పవన్ వెంటనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు.

08/16/2016 - 21:20

ఆది, నమితా ప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి, వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’.

Pages