S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/26/2018 - 01:32

న్యూఢిల్లీ, జూన్ 25: ఎమర్జన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జర్మన్ నియంత హిట్లర్‌తో పోల్చారు. మనదేశంలో ఎమర్జన్సీని 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించారు. ఎమర్జన్సీ విధించి ఈరోజుకు 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రి జైట్లీ ఆ చీకటిరోజుల గురించి పేర్కొంటూ ట్వీట్ చేశారు.

06/26/2018 - 01:30

విమాన ప్రమాదాలకు చాలా వరకూ పక్షులే కారణమన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే, విమానాశ్రయాల సమీపంలో పక్షులు చేరకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడి బిజూ పట్నాయక్ విమానాశ్రయంలో వందలాదిగా పక్షలు గాల్లో చక్కర్లు కొడుతూ వినానాలను
చుట్టుముడుతున్నాయి. ల్యాండింగ్ సమయంలోనూ ఇబ్బందులు సృష్టిస్తున్నాయి

06/26/2018 - 01:28

న్యూఢిల్లీ, జూన్ 25: అయోధ్యంలో రామమందిరం నిర్మాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారభించాలన్న సంకేతాలు విశ్వహిందూ పరిషత్ ఇచ్చింది. అయోధ్యపై సుప్రీం కోర్టు రెండు మూడు నెలల్లో తీర్పు ఇవ్వని పక్షంలో ఏం చేయాలన్న దానిపై పలువురు పీఠాధిపతులు, సాధువులతో వీహెచ్‌పీ సంప్రదింపులు జరపనుంది.

06/26/2018 - 01:26

న్యూఢిల్లీ, జూన్ 25: గత వారం రోజులుగా ఢిల్లీలో మలేరియా కేసులు 11 నమోదైనట్టు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీటితో ఈ సీజన్‌లో మలేరియా కేసుల సంఖ్య 40కు చేరుకుంది. కాగా, జూన్ 16,23 మధ్య నాలుగు డెంగ్యూకేసులు మాత్రమే నమోదు కాగా, మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన 40 కేసుల్లో జూన్‌లో 19, మేలో 17, ఏప్రిల్, మార్చి నెలల్లో ఒకటి చొప్పున ఉన్నాయి.

06/26/2018 - 01:25

లక్నో, జూన్ 25: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకే మద్దతు ఇస్తామని రాష్ట్రీయ షియా సమాజ్(ఆర్‌ఎస్‌ఎస్) వెల్లడించింది.‘బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీకే షియా ముస్లింలు మద్దతు ఇస్తారు.

06/26/2018 - 01:24

న్యూఢిల్లీ, జూన్ 25: తమిళనాడు అసెంబ్లీ నుంచి బహిష్కృతులైన 18 మంది ఎమ్మెల్యేల కేసును ఈ నెల 27న సుప్రీంకోర్టు విచారించనుంది. తమ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీ చేసి సుప్రీంకోర్టులో విచారణ జరపాలని 18మంది బహిష్కృత ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించి కేసును బుధవారం విచారిస్తామని పేర్కొంది.

06/26/2018 - 01:24

న్యూఢిల్లీ, జూన్ 25: త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు జూలైలో జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ (ఎం) నిర్ణయించింది. మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆ పార్టీ ఒక ప్రకటన చేస్తూ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

06/26/2018 - 01:11

చిత్రం..ముంబయి నగరాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్న నేపథ్యంలో, పట్టాలు కూడా మునిగిపోగా, ఆ నీటిలోనే గమ్యాలకు వెళుతున్న సబర్బన్ రైళ్లు

06/26/2018 - 00:51

న్యూఢిల్లీ, జూన్ 25: జూలై 18 నుండి ఆగస్టు 10 తేదీ వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ సహాయ, సహకారాలను అందజేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ విజప్తి చేశారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల

06/26/2018 - 00:15

న్యూఢిల్లీ, జూన్ 25: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 తేదీ నుంచి మొదలై ఇరవై రెండు రోజుల పాటు కొనసాగి ఆగస్టు 10న ముగుస్తాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే రాజ్యసభకు కొత్త ఉపాధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. బీజేపీకి, ప్రతిపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ప్రస్తుత పరిస్థితుల్లో జరుగనున్న ఈ సమావేశాలు గత సమావేశాల మాదిరిగానే గొడవ, గందరగోళానికి గురి కానున్నాయి.

Pages