S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/04/2018 - 01:22

లక్నో, జూన్ 3: ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో, కాంగ్రెస్ ‘మద్దతు పాత్ర’ పోషించక తప్పదని ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరి అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బలంగా ఉన్నచోట్ల ప్రాంతీయ పార్టీలు దానికి మద్దతివ్వాలన్నారు. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపిణీపై ఆయన పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

06/04/2018 - 00:50

న్యూఢిల్లీ, జూన్ 3: భారత పూర్వ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమంలో పాల్గొనాలన్న నిర్ణయం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, ఇతర లౌకిక వాద పార్టీల్లో పెద్ద ఎత్తున దుమారం రేకెత్తిస్తోంది. ఈ అంశంపై ప్రణబ్ ముఖర్జీ ఘాటుగానే స్పందించారు. ‘ఆరెస్సెస్ సమావేశానికి వెళుతున్నాను. నేను ఏమి చెప్పదలుచుకున్నానో అదే విషయాన్ని నాగ్‌పూర్‌లో చెబుతా.

06/04/2018 - 00:49

న్యూఢిల్లీ, జూన్ 3: మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపి కుట్రతో 60లక్షల మంది నకిలీ ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి బీజేపి బాధ్యత వహించాలని, ఈ అంశంపై విచారణ జరిపించి నకిలీ ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది.

06/04/2018 - 00:53

న్యూఢిల్లీ, జూన్ 3: సైకిల్ తొక్కడం అందరూ అలవరచుకోవాలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ‘ప్రపంచ సైకిల్ ర్యాలీ’ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న పట్టణీకరణ, జీవన పరిస్థితుల వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

06/04/2018 - 04:12

బాలాసోర్, (ఒడిశా): భారత్ ఖండాంతర క్షిపణి అగ్ని-5ని ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ఐదు వేల కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాల ఛేదనకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అగ్ని-5ని స్వదేశీ పరిజ్ఞానంతో భారత శాస్తవ్రేత్తలు రూపొందించారు.

06/04/2018 - 04:11

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం 14 నిమిషాల సేపు రాడార్ పరిధి నుంచి తప్పిపోవడంతో కొంతసేపు భారత్, మారిషన్ వైమానిక రంగ అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాని కొద్దిసేపు తర్వాత మళ్లీ రాడార్ నుంచి సంకేతాలు అందడం, మారిషస్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన శనివారం జరిగింది.

06/04/2018 - 00:25

జమ్ము, జూన్ 3: పాకిస్తాన్ తన పాతబుద్ధిని పోనిచ్చుకోలేదు. అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడి కాల్పులకు బరితెగించింది. ఈ ఘటనలో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. నిస్సిగ్గుగా నిబంధనలకు తూట్లుపొడిచిన పాకిస్తాన్‌కు ధీటుగా బదులిచ్చేందుకు పెద్దఎత్తున సరిహద్దు భద్రతా బలగాలను అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ మొహరించింది.

06/04/2018 - 00:19

జమ్మూ గ్రామాలు దాహర్తితో అల్లాడుతున్నాయ. ఎండాకాలం దాటుతున్నా మంచినీటి కోసం పల్లెలు మైళ్లదూరం పోవాల్సి వస్తుంది. సాంబ జిల్లాలోని ఓ గ్రామంలో అడుగంటిన బావిలో కొద్దిపాటి ఊట నీరైనా దొరక్కపోతుందా? అన్న ఆశతో చూస్తున్న పల్లె మహిళలు.

06/04/2018 - 00:17

పెట్రోలు ధరలు ఎలా పెరుగుతున్నాయ.. ఎలా తగ్గుతున్నాయో ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి వ్యాపారులు ప్రాక్టికల్‌గా చూపించారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా పెట్రో మంట పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ ఇలా పెద్దఎత్తున అగ్నికీలలతో ప్రదర్శన ఇచ్చారు.

06/04/2018 - 00:15

కేంద్రంపై రైతు కనె్నర్ర చేశాడు. దేశానికి అన్నంపెట్టే రైతును కేంద్రం వెటకారం చేస్తుందంటూ గ్రామ బంద్‌కు రెడీ అయ్యాడు. భారతీయ కిసాన్ ఆందోళన్ సారథ్యంలో 8 రాష్ట్రాల రైతులు ఆందోళనకు దిగారు. టమోటాలను రోడ్డుపై పడేసి నిరసన తెలుపుతున్న మీరట్ రైతులు.

Pages