S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/03/2018 - 01:09

రేణిగుంట, ఏప్రిల్ 2: ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రన్‌వేపై ఆగిపోయిన సంఘటన సోమవారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు రేణిగుంట నుంచి హైదరాబాద్ వయా ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది.

04/02/2018 - 17:27

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ దళిత సంఘాలు దేశ్యాప్తంగా భారత్ బంద్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పుపై రివ్యూకు వెళుతున్నట్టు స్పష్టం చేసింది.‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మేం సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేశాం.

04/02/2018 - 17:18

లక్నో: ఎస్టీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సక్రమంగా అమలు చేయటం లేదని దళితులు చేపట్టిన భారత్ బంద్ హజాక్ చేశారని బిఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఈ పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. న్యాయబద్దమైన డిమాండ్లతో దళితులు చేసిన ఆందోళనను గూండాలు హైజాక్ చేశారని అన్నారు. దళితుల హక్కులు కాలరాస్తున్న బీజేపీపై దళితులు ఆగ్రహాంతో ఉన్నారని అన్నారు.

04/02/2018 - 17:17

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయమాల్యాను లండన్‌లో కలిశారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి విరాళంగా మాల్యా వద్ద నుంచి 150 కోట్ల రూపాయలను స్వీకరించారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీకి రావటం వెనుక రాజకీయ లబ్ది ఉందని విమర్శించారు. సీఎంపై సభాహక్కుల సంఘం నోటీసు ఇచ్చామని అన్నారు.

04/02/2018 - 16:33

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను ఈనె 27వ తేదీవరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఐఎభ్‌ఎక్స్ మీడియా కేసుల కార్తీకి ఈనెల 23న బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.

04/02/2018 - 16:32

న్యూఢిల్లీ: దళితుల భారత్ బంద్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక దాడులు జరగటంతో నలుగురు మృతి చెందిన విషయం. దీనిపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శాంతిభద్రతలను కాపాడాలని, ఎవ్వరూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తిచేశారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని తెలిపారు.

04/02/2018 - 16:32

న్యూఢిల్లీ: ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయటం లేదని దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ మధ్యప్రదేశ్‌లో హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులకు, పోలీసులకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. భింద్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తటంతో అక్కడ కూడా ఒకరు చనిపోయారు. ఇక్కడ ఆందోళనకారులపై కాల్పులు జరపగా.. రజావత్ అనే వ్యక్తి చనిపోయాడు.

04/02/2018 - 17:11

న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఐసీస్ చేతిలో హత్యకు గురైన 39మంది భారతీయుల మృతదేహాలు భారత్‌కు తీసుకువచ్చారు. జనరల్ వీకే సింగ్ నేతృత్వంలో ఈ మృతదేహాలను ప్రత్యేక విమానంలో ఇరాక్ నుంచి అమృతసర్‌కు తీసుకురావటం జరిగింది.

04/02/2018 - 15:57

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్షమాపణ చెప్పారు. తనపై జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా, అశుతోష్ కూడా జైట్లీకి క్షమాపణ చెప్పారు. వీరంతా సంయుక్తంగా జైట్లీకి క్షమాపణ లేఖ రాశారు.

04/02/2018 - 13:40

న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం అమలు పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన చట్టం అమలు కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నాలుగేళ్లుగా విభజన చట్టం ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్‌ సిక్రీ ధర్మాసనం ప్రశ్నించింది.

Pages