S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/13/2018 - 00:17

న్యూఢిల్లీ, మార్చి 12: వీవీఐపీలైన రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధానిల కోసం ప్రత్యేక విమానాలు సిద్ధమవుతున్నాయి. సరికొత్త ఆధునిక విమానాలు 2020నాటికి వినియోగంలోకి వస్తాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలనే ఎయిర్ ఇండియా బోయింగ్ 777-300 ఈఆర్‌లను కొనుగోలు చేశాయి. వీటిని వీఐపీలకు అనుగుణంగా మార్పు చేస్తారు.

03/12/2018 - 06:11

న్యూఢిల్లీ, మార్చి 11:పర్యావరణ సమతూకాన్ని పరిరక్షించడంతో పాటు వాతావరణ కాలుష్యాన్నీ నివారించాలన్న భారత ఆశయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అన్ని దేశాల భాగస్వామ్యంతోనే పుడమిని కాపాడుకోగలుగుతామన్న అభిమతానికి గుర్తింపుగా ఒపెక్ తరహాలో భారత్, ఫ్రాన్స్ సహా 42 దేశాలతో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ) ఆవిర్భవించింది.

03/12/2018 - 05:59

సింగపూర్, మార్చి 11: తన తండ్రి రాజీవ్‌గాంధీ హంతకులను తాను, తన సోదరి ప్రియాంక పూర్తిగా క్షమించామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘వ్యక్తులను ద్వేషించడం చాలా కష్టం. అందుకే క్షమించాం’ అని సింగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

03/12/2018 - 06:33

బీజింగ్, మార్చి 11: ఇంతవరకూ ఏ అధ్యక్షుడూ సాధించని చారిత్రక ఘనతను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకూ అధ్యక్ష పదవిలో రెండుసార్లు మాత్రమే ఎన్నికయ్యే అవకాశం ఒక వ్యక్తికి ఉండేది. కానీ, జీ జిన్‌పింగ్ ఇప్పుడు చైనాకు జీవితకాల అధ్యక్షులైపోయారు. ఇందుకు సంబంధించి రెండు టెర్మ్‌ల పరిమితిని తొలగిస్తూ చైనా పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

03/12/2018 - 02:52

ముంబయి, మార్చి 11: గత ఐదు రోజులుగా కొనసాగుతున్న నాసిక్ జిల్లా రైతుల మహా పాదయాత్ర ఆదివారం రాష్ట్ర రాజధాని ముంబయికి చేరుకుంది. మండే ఎండను లెక్క చేయకుండా ఐదు రోజులుగా జరుగుతున్న ఈ పాదయాత్రలో 35వేల మంది రైతులు పాల్గొన్నారు. ఎట్టకేలకు వీరు ముంబయి సరిహద్దులోని థాణెకు చేరుకున్నారు. అక్కడినుంచి వీరు సియాన్‌లోని కె.జె. సోమయ్య మైదానానికి బయలుదేరారు. ఇక్కడ పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాటు చేశారు.

03/11/2018 - 04:20

బెంగళూరు: దేశంలో ఓటర్ గుర్తింపు కార్డులకు 32 కోట్ల ఆధార్ నంబర్లు అనుంధానం అయినట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ‘ఇప్పటికి 32 కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీకి లింక్ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం త్వరలోనే 54.5 కోట్ల నంబర్లు అనుసంధానం పూర్తవుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.

03/11/2018 - 02:54

ఢిల్లీలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌కు హాజరైన ప్రతినిధులతో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు

03/11/2018 - 02:52

ముంబయి, మార్చి 10: రాఫెల్ కొనుగోలు ఒప్పందాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు బాధ్యతారాహిత్యం, జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 7.5 బిలియన్ యూరోలతో ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ కుంభకోణం చోటుచేసుకుందంటూ ఎన్డీయేపై దాడికి దిగిన కాంగ్రెస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

03/11/2018 - 02:50

కోయంబత్తూరు, మార్చి 10: సమాజంలో తీసుకురావాల్సిన పరివర్తన విషయంలో ప్రజలందరూ ఒక్కటిగా ముందుకు రావాలని మక్కల్ నీతి మయమ్ (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ పిలుపునిచ్చారు. తమిళనాడు అంతటా రెండో విడత పర్యటన చేపట్టిన ఆయన శనివారం తిరుపూర్ జిల్లాలోని అవనాశి వద్ద జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడారు.

03/11/2018 - 02:48

ముంబయి, మార్చి 10: దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోనూ గుణాత్మకమైన విద్యావ్యవస్థను పాదుకొల్పడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. విద్యకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తే అంతగానూ పౌరులకు రాజ్యాంగ, సామాజిక భద్రత చేకూరుతుందని ముఖ్యంగా మహిళలు, బాలికలు దీనివల్ల సమాజంలో మరింత సురక్షితమైన స్థానాన్ని సముపార్జించుకో గలుగుతారని అన్నారు.

Pages