S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/19/2016 - 03:38

హైదరాబాద్, ఆగస్టు 18: ఇప్పటివరకూ కేంద్రం సొమ్ముతో సొంత సోకులు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార పప్పులు ఇకపై ఉడకవు. కేంద్రం ఇస్తోన్న నిధులతో కొనసాగుతున్న రాష్ట్ర పథకాల గురించి తప్పనిసరిగా ప్రచారం చేయాలని, అవి కేంద్ర పథకాలుగానే చెలామణి చేయాలని కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలు, దేశంలో పబ్లిసిటీ సీఎంలుగా పేరున్న వారికి మింగుడుపడకుండా ఉంది.

08/19/2016 - 00:54

ఉడుపి (కర్ణాటక), ఆగస్టు 18: కర్ణాటకలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), బజరంగ్ దళ్‌కు చెందిన గోసంరక్షకులు జరిపిన దాడిలో ఒక బిజెపి కార్యకర్త మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉడుపి జిల్లాలోని హెబ్రి సమీపంలో బుధవారం రాత్రి విహెచ్‌పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు దారికాచి ఈ దాడికి తెగబడ్డారు.

08/19/2016 - 00:53

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. సున్నితమైన అంశంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం వాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. కాశ్మీర్ లోయలో శాంతికోసం అన్ని పార్టీలు సహాకరించాలని కోరారు.

08/18/2016 - 16:09

న్యూఢిల్లి:రాజధాని న్యూఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో 2 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించ తలపెట్టిన బిజెపి నూతన కార్యాలయం పనులకు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. 70 గదులతో అత్యంత ఆధునికంగా దీనిని నిర్మించనున్నారు. పార్టీకోసం ప్రాణత్యాగం చేసినవారికి ఈ భవనాన్ని అంకితం చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరయ్యారు.

08/18/2016 - 15:26

న్యూఢిల్లి: రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత క్రీడాకారిణి సాక్షిని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలతో ముంచెత్తారు. భరతమాత ముద్దుబిడ్డ సాక్షి రాఖీ కానుకగా ఒలింపిక్స్ పతకాన్ని సాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె సాధించిన ఘనత కోట్లాదిమంది భారతీయులకు స్ఫూర్తి అని కొనియాడారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీకూడా సాక్షికి అభినందనలు తెలిపారు.

08/18/2016 - 15:25

బెంగళూరు:కాశ్మీర్‌లో పరిస్థితులపై అమ్నెస్టి సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో భారత్ వ్యతిరేక నినాదాలు విన్పించిన సంఘటనపై కర్నాటక, గోవాల్లోని అమ్నెస్టి ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయాలను మూసివేశారు. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేసిన ఆ కార్యక్రమం దేశ ద్రోహమని బిజెపి విద్యార్థి విభాగం ఏబివిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది.

08/18/2016 - 15:10

న్యూఢిల్లి:రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షికి ప్రశంసల పరంపర వెల్లువెత్తుతోంది. తాజాగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆమెను అభినందిస్తూ ట్విట్టర్‌లో సందేశం పోస్ట్ చేశారు. తనకేం కావాలో అడగాలని అభయం ఇచ్చారు.

08/18/2016 - 15:10

న్యూఢిల్లి:కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూఢిల్లీలోని శ్రీ గంగారాం ఆస్పత్రిలో మళ్లీ చేరారు. ఆగస్టు 3న వారణాసిలో రోడ్‌షోలో పాల్గొన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా భుజానికి గాయం కావడంతో ఆమెకు శస్తచ్రికిత్స చేశారు. రెండురోజుల కిందట ఆమె డిశ్ఛార్జి అయ్యారు. అయితే కుట్లు విప్పించుకునేందుకు ఆమె మళ్లీ ఆస్పత్రిలో చేరారు. రెండుమూడు రోజులపాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది.

08/18/2016 - 04:00

భద్రాచలం/చింతూరు, ఆగస్టు 17: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-దంతేవాడ సరిహద్దులో దండకారణ్యంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఏడుగురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను హెలీకాప్టర్ ద్వారా జగదల్‌పూర్‌కు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. దంతెవాడ జిల్లా దబ్బాకున్నా అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

08/18/2016 - 02:16

న్యూఢిల్లీ, ఆగస్టు 17: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌కు, ఫిరాయింపులకు పాల్పడిన శాసనసభ్యులకు సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేస్తూ మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

Pages