జాతీయ వార్తలు

అది దళిత సమస్య కానేకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పిహెచ్.డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యను దళిత, దళితేతర వివాదంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. బుధవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గెహ్లాట్, సాంప్లాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కులాల వివాదంగా మార్చటం ఎంతమాత్రం మంచిది కాదని, దీనివల్ల విద్యార్థులకు, వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఎంతో నష్టం వాటిల్లుతుందని స్మృతి పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రోహిత్ ఆత్మహత్య ఘటనను వివరించిన అనంతరం మీడియాతో మాట్లాడటం గమనార్హం. రోహిత్ సూసైడ్ నోట్‌లో ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాసినట్టే కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు సైతం వర్శిటీలో నెలకొన్న దురదృష్టకర పరిస్థితిపై 2014లో లేఖ రాశారని, ఆ లేఖపై తమ శాఖ ఆరుసార్లు హెచ్‌సియుని వివరణ కోరిందని గుర్తు చేశారు. ఎంపీల లేఖలకు నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కనుక, ఇన్నిసార్లు వివరణ అడగాల్సి వచ్చిందని స్మృతి వెల్లడించారు. వర్శిటీలో దళిత విద్యార్థులపట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారన్న విహెచ్ ప్రధాన ఆరోపణగా ఆమె తెలిపారు. విహెచ్ ఫిర్యాదుపైనే అప్పుడు అధికారంలోవున్న యూపీఏ చర్య తీసుకునివుంటే రోహిత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది కాదన్నారు. రోహిత్ ఆత్మహత్య దళిత, దళితేతర వివాదం ఎంతమాత్రం కాదన్నారు. బండారు దత్తాత్రేయ వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తి, అలాగే, ఐదుగురు దళిత విద్యార్థులపై దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చిన ప్రొఫెసర్ సైతం దళిత వర్గానికి చెందిన వ్యక్తేనని, రోహిత్‌తో గొడవ పడిన విద్యార్థి బిసీ విద్యార్థి అని ఆమె వివరించారు. గత్యంతరం లేక కులాలను ప్రస్తావించాల్సి వస్తోందని స్మృతి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థులపై వర్శిటీ బోర్డు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించిందని స్మృతి వెల్లడించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందన్నారు. తమ శాఖ పంపించిన ఇద్దరు సభ్యుల నిజ నిర్దానణ కమిటీ నివేదిక బుధవారమే అందనుందని తెలిపారు. కేంద్ర మంత్రులిద్దరూ పదవులకు రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ డిమాండ్‌ను ప్రస్తావించినపుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్థారించిన నియమాల ప్రకారమే తాను పని చేశాననేది రాజీనామా డిమాండ్ చేస్తున్న గ్రహించాలని సమాధానమిచ్చారు. బీసీ విద్యార్థులపై దాడి చేసినందుకే ఐదుగురు దళిత విద్యార్థులపై వర్శిటీ క్రమశిక్షణా బోర్డు చర్య తీసుకుందన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. రోహిత్ ఆత్మహత్య పట్ల విచారం వ్యక్తం చేస్తూ, దీన్నొక కుల పోరాటంగా చిత్రీకరించి రెచ్చగొడుతున్నారని పలుమార్లు ప్రస్తావించారు. దళిత విద్యార్థులపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మొదట వర్శిటీలోని దళిత ప్రొఫెసర్లకు చెప్పటం జరిగిందన్నారు. వర్శిటీ గొడవల వ్యవహారం హైకోర్టు పరిశీలనలో ఉంది, మరోవైపు పోలీస్ దర్యాప్తు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అవసరానికి మించి వివరాలు వెల్లడించటం మంచిది కాదన్నారు. విహెచ్ లేఖపై గొడవచేయని వాళ్లు, దత్తాత్రేయ లేఖపైనే ఎందుకు గొడవ చేస్తున్నారని స్మృతి ప్రశ్నించారు. నిష్పాక్షిత దర్యాప్తు జరుగుతోందని, బాధితులకు న్యాయం చేస్తామని స్మృతి హామీ ఇచ్చారు.