జాతీయ వార్తలు

కోల్‌కతా-ఖుల్నా రైలు ట్రయల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రాపోల్, ఏప్రిల్ 8: బంగ్లాదేశ్‌లోని ఖుల్నా సిటీ, కోల్‌కతాల మధ్య ప్రయాణికుల రైలు సర్వీసును శనివారం ప్రారంభించారు. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్‌కు రైలు చేరుకోవడంతో ఈ రైలు సర్వీసులు లాంఛనంగా ప్రారంభమైనట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు సంయుక్తంగా న్యూఢిల్లీలో వీడియో లింక్ ద్వారా ఈ రైలు సర్వీసును ప్రారంభించారు. కాగా, కోల్‌కతా-ఖుల్నాల మధ్య రెగ్యులర్ రైలు సర్వీసులు జూలైనుంచి ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. పెట్రాపోల్ గుండా భారత్-బంగ్లా రైలు కారిడార్ గూడ్స్ రైళ్ల కోసం 2011లోనే ప్రారంభమైంది. కాగా, కోల్‌కతా- ఖుల్నా- ఢాకా బస్ సర్వీస్ ట్రయల్ రన్‌ను కూడా శనివారం ఇక్కడ ప్రారంభించారు. కోల్‌కతాలోని రాష్ట్ర సెక్రటేరియట్‌నుంచి మూడు బస్సులను పశ్చిమ బెంగాల్ రాష్టమ్రంత్రులు పార్థ చటర్జీ, సుమ్రతా ముఖర్జీ, ఫిరాద్ అహ్మద్‌లు జెండా ఊపి ప్రారంభించారు.
జూన్‌నుంచి రెగ్యులర్ బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయి. కోల్‌కతానుంచి 13 గంటల్లో 409 కిలోమీటర్లు ప్రయాణించి బస్సు ఢాకాకు చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. టికెట్ ధరను ఇంకా నిర్ణయించలేదని వారు తెలిపారు. సరిహద్దుల్లో సెక్యూరిటీ చెకప్‌లతో కలుపుకొని ఖుల్నా చేరుకోవడానికి 7 గంటల సమయం పడుతుంది.

చిత్రం..రైలు సర్వీసును ప్రారంభిస్తున్న
ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా