శ్రీకాకుళం

బాలిక విద్యకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 16: బాలికలు చదువుకున్న నాడే సమాజం అభివృద్ధి చెందుతుందని, కావున బాలికావిద్యకు ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కెజిబి వి పాఠశాలల ప్రత్యేక అధికారులు, అకౌంటట్‌లకు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మరియు పాలనా అంశాలపై రెండురోజుల శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటికీ బాలికా విద్యపై సమాజంలో ఇంకా వివక్ష కొనసాగుతుందని, సమాజ అభివృద్ధికి విద్య మాత్రమే పరిష్కారమార్గమని, విద్య ద్వారా మనోధైర్యం, ఆత్మవిశ్వాసాలు పెంపొందుతాయని ఆయన తెలిపారు. చట్టాలు ఎన్ని చేసినా సమాజంలో మార్పు తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిష్నాతులైన ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కెజిబివి పాఠశాలలో సౌకర్యాలను కలుగజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పూర్తివికాసం కలుగుతుందని, సమాజంపై సేవాభావం పెంపొందుతుందని, విలువలతో కూడిన విద్యను ఉపాధ్యాయులు అందించాలని చెప్పారు. ఉపాధ్యాయులకు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాల ద్వారా వారి బోధనాపటిమను పెంపొందిస్తున్నామని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లా ద్వితీయస్థానం పొందడం చాలా ఆనందదాయకమన్నారు. ఫలితాలతోపాటు నాణ్యమైన విద్యను కూడా అందించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయులు కౌమార దశ పిల్లలను సొంతబిడ్డలుగా చూసుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలని, వారిని ప్రయోజకులుగా చేయాలన్నారు. ప్రభుత్వం యంత్రాంగం తరుపున సహాయ సహకరాలు అందిస్తామని, వచ్చే ఏడాదికి నాణ్యమైన విద్యకు శతశాతం పలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో స్టాక్ రిజిస్టర్లు, అకౌంట్ పుస్తకాలు, క్యాష్‌బుక్ తదితర వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను రాష్ట్ర ఫైనాన్షియల్ కంట్రోలర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డి ఇవో ఎ. ప్రభాకరరావు, ఎస్ ఎస్ ఎ పివో ఎస్.త్రినాధరావు, స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ జివి ఎన్ మూర్తి, కనె్సల్టెంట్లు రాజన్, శివకుమార్, ఎవో మస్తానయ్య, శ్రీకాకుళం ఎఫ్ ఎవో ఎ.మోహనరావు, జిసిడివో సత్యవతి, అకడమిక్ మోనటరింగ్ ఆఫీసర్ యోగానంద్, ఎపివో జివిరమణారావు, ప్రత్యామ్నాయ పాఠశాలల కో ఆర్డినేటర్ శ్రీ్ధర్ పాల్గొన్నారు.