జాతీయ వార్తలు

వాతావరణ మార్పులపై పోరులో ముందున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: వాతావరణ మార్పుల వలన ఎదురవుతున్న సమస్యల నుంచి మానవాళిని గట్టెక్కించేందుకు భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం అమెరికా వైదొలిగినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలగబోదని, ప్రత్యేకించి ఈ విషయంలో భారత్, చైనా బలమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ దేశాలను ముం దుకు నడిపిస్తుండటం ఎంతో ముదావహమని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం (యుఎన్‌ఇపి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్ కొనియాడారు. వాతావరణ మార్పుల వలన ప్రపంచానికి పెనుసవాళ్లు తప్పవని విజ్ఞానశాస్త్రం స్పష్టం చేస్తోందని, కనుక ఈ సవాళ్లను అధిగమించేందుకు మరింత కృషి అవసరమని ఆయన ఒక ప్రకటనలో ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలు ఇటీవల పారిస్‌లో కుదుర్చుకున్న వాతావరణ ఒప్పందం నుంచి తాము వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఎరిక్ స్పందిస్తూ, వాతావరణ మార్పులపై తక్షణమే స్పందించి, కార్యాచరణకు ఉపక్రమించాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందన్నారు. వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినంత మాత్రాన పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు ఆగబోవని, వాతావరణ సమస్యల నుంచి భవిష్యత్తు తరాల వారిని రక్షించేందుకు భారత్‌తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్ (ఇయు) బలమైన నాయకత్వంతో ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయని, దీంతో వాతావరణ సమస్యలపై కలసికట్టుగా పోరాడేందుకు ఇప్పటికే 190 దేశాలు కంకణం కట్టుకున్నాయని ఎరిక్ సోల్హెమ్ తెలిపారు.