జాతీయ వార్తలు

దేశంలో ఐసిస్ ప్రభావం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రెండో దేశం అయినప్పటికీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ మన దేశంలో కాలు మోపలేకపోయిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2015- 16లో పంజాబ్‌లో జరిగిన రెండు ఉగ్రవాద దాడులు తప్పిస్తే దేశంలో శాంతిభద్రతల పరిస్థితి మొత్తంమీద అదుపులోనే ఉందని మోదీ ప్రభు త్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల భద్రతా ఏజన్సీల మధ్య మెరుగైన సమన్వయం కారణంగా 90 మందికిపైగా ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేయగలిగామని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టినందున, అందులో భాగంగా ఇండియన్ ముజాహిదీన్ గ్రూపునకు చెందిన అయిదుగురు ఉగ్రవాదులకు మరణ శిక్షలు విధించడం కూడా జరిగిందని ఆయ న చెప్పారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయ డానికి ఐసిస్, పాకిస్తాన్‌కు చెందిన హర్కతుల్ ముజాహిదీన్ గ్రూపునకు చెందిన ప్రధాన సంస్థ ‘అన్సా ర్-ఉల్-ఉమ్మా’ను నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చడం జరిగిందని రాజ్‌నాథ్ చెప్పారు.
గత యుపిఏ ప్రభుత్వ హయాంలో 2011 నుంచి 2013 మధ్య కాలంలో 239 మంది మిలిటెంట్లను మట్టుబెట్టగా, 2014-17 మధ్య కాలంలో ఈ సంఖ్య 369కి పెరిగిందని హోం మంత్రి చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సైన్యం సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాకిస్తాన్‌నుంచి చొరబాటు యత్నాలు అంతకుముందు ఏడాది ఆరునెలల కాలంతో పోలిస్తే 45 శాతం తగ్గాయని చెప్పారు. ‘జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేసి శాంతిని నెలకొల్పుతాం’ అని హోం మంత్రి స్పష్టం చేశారు.
జమ్మూ, కాశ్మీర్‌లో యువకులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు కల్పించడారికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొంటున్న ప్రత్యేక చర్యలను హోంమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. యుపిఏ ప్రభు త్వం 2011- 14 మధ్య కాలంలో మూడేళ్లలో 1900 మంది యువకులకు నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి 1591 మందికి ఉద్యోగాలు కల్పించగా, 2014-17 మధ్య కాలంలో 20,355 మందికి శిక్షణ ఇవ్వగా, 30,175 మందికి జాబ్ ఆఫర్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
25 శాతం తగ్గిన నక్సల్స్ దాడులు
తమ ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ వ్యతిరేక చర్యలను రాజ్‌నాథ్ వివరిస్తూ 2011-14 మధ్య కాలంతో పోలిస్తే గత మూడేళ్లలో నక్సల్స్ దాడుల్లో మృతి చెందినవారి సంఖ్య 25 శాతం తగ్గాయని, నక్సల్స్ దాడుల్లో మృతిచెందినవారి సంఖ్య సైతం 42 శాతం తగ్గిందని చెప్పారు. చత్తీస్‌గఢ్ సహా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భారీఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇది నక్సల్స్ కార్యకలాపాలకు మద్దతుగా ఉండిన వ్యవస్థ వెన్ను విరిచేసిందని ఆయన చెప్పారు. ఇంత వేగంగా అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని ఆయన చెప్పారు. చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ప్రాంతంలో ఒక విమానాశ్రయం ఈ ఏడాదిలోనే పూర్తిగా వినియోగానికి వస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. భద్రతా దళాలు బోడో తీవ్రవాద సంస్థ ఎన్‌డిఎఫ్‌బి(ఎస్) వెన్నువిరిచేశాయని, దీని ఫలితంగా గత మూడేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చాలా తక్కువగా జరిగాయని రాజ్‌నాథ్ చెప్పారు. 911 మంది ఎన్‌డిఎఫ్‌బి తీవ్రవాదులను అరెస్టు చేయడం జరిగిందని, 52 మందిని మట్టుబెట్టారని, పెద్దమొత్తంలో ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యుపిఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే గత మూడేళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ పౌరుల మరణాలు, కిడ్నాప్‌లు లాంటి సంఘటనలు గణనీయంగా తగ్గాయని రాజ్‌నాథ్ చెప్పారు.

ఎన్‌డిఏ ప్రభుత్వ మూడేళ్ల పాలన ప్రగతిపై పుస్తకాన్ని
విడుదల చేస్తున్న రాజనాథ్‌సింగ్