జాతీయ వార్తలు

ఆర్మీ హెడ్‌క్వార్టర్లో బదిలీల రాకెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: దేశ రాజధాని ఢిల్లీలో సైనిక ప్రధాన కార్యాలంలో ‘బదిలీల రాకెట్’ను సిబిఐ ఛేదించింది. అక్రమ బదిలీలకు సంబంధించి ఓ లెఫ్టినెంటర్ కల్నల్‌తోపాటు దళారిని సిబిఐ శనివారం అరెస్టు చేసింది. తమకు కావల్సిన చోటకు బదిలీ చేయించుకోడానికి లక్షలాది రూపాయలు లంచంగా ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ పర్సనల్ డివిజన్‌లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ రంగనాథన్ సువర్‌మణి మోనీ, మధ్యవర్తి గౌరవ్ కోహ్లీలను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన ఓ సైనిక అధికారి బది లీకోసం వారు రెండు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని సిబిఐ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన కేంద్రంలో పోస్టిం గ్‌కోసం సీనియర్ అధికారులు సైతం అవినీతికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌లో మరికొందరు సీనియర్ సైనిక అధికారుల పాత్ర ఉండిఉంటుందని సిబిఐ అనుమానిస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో బ్రిగేడియర్ ఎస్‌కె గ్రోవర్ పేరు ఉంది. అయితే నిందితుల జాబితాలో ఆయన పేరును చేర్చలేదు. ఇలాఉండగా మోనీతోపాటు హైదరాబాద్‌కు చెందిన సైనిక అధికారి పురుషోత్తం, బెంగళూరు బ్యారెక్స్, స్టోర్స్ అధికారి ఎస్ సుభాష్, మధ్యవర్తి గౌరవ్ కోహ్లీలపై కేసు నమోదు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. హవాలా చానల్ ద్వారా సొమ్ములు చేతులు మారినట్టు సిబిఐ పేర్కొంది.