జాతీయ వార్తలు

బంగారంపై 3శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: వచ్చే నెల 1నుంచి వస్తు సేవల పన్ను(జిఎస్‌టి)ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు పన్ను రేట్లు నిర్ణయించని బంగారం లాంటి కొన్ని వస్తువులపై పన్నును నిర్ణయించడం కోసం జిఎస్‌టి కౌన్సిల్ శనివారం ఇక్కడ సమావేశం అయింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జైట్లీ విలేఖరులతో మాట్లాడుతూ బంగారం, బంగారు ఆభరణాలపై 3 శాతం జిఎస్‌టి విధించాలని సమావేశం నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ముడి వజ్రాలపై 025 శాతం పన్ను విధించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. కాగా, బంగారంపై 3 శాతం జిఎస్‌టి అంటే ఇప్పుడు అమలవుతున్న పన్నుకు పెద్దగా తేడా ఏమీ రాదని, ఆభరణాల వ్యాపారులు దీన్ని స్వాగతించవచ్చని పన్ను రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం బంగారంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం, మరో శాతం వ్యాట్ కలుపుకొని 2 శాతం పన్ను విధిస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నాయి. కాగా, శనివారం నాటి సమావేశంలో జిఎస్‌టి కౌన్సిల్ మొత్తం ఆరు వస్తువులపై విధించబోయే పన్ను రేట్లను ఖరారు చేసింది. వాటిలో దుస్తులు, పాదరక్షలు, ప్యాకేజ్డ్ ఆహార వస్తువులు, బీడీలు బిస్కట్లు లాంటివి ఉన్నాయి.జిఎస్‌టి కౌన్సిల్ తదుపరి సమావేశం ఈ నెల 11న జరుగుతుంది.
కాగా శనివారం జరిగిన సమావేశంలో జిఎస్‌టి కౌన్సిల్ కొత్త పన్ను విధానంలోకి మారడానికి మార్గం సుగమం చేసే ట్రాన్సిషన్ చట్టాల ముసాయిదాను కూడా ఆమోదించింది. ఆమోదించిన ఈ ముసాయిదా చట్ట ప్రకారం జిఎస్‌టి అమలయిన తర్వాత ఏదయినా కంపెనీ కొత్త పన్ను అమలుకు ముందు కంపెనీ వద్ద ఉన్న నిల్వలపై చెల్లించే ఎక్సైజ్ సుంకానికి బదులుగా చెల్లించే తమ సెంట్రల్ జిఎస్‌టి బకాయిల్లో 40 శాతం దాకా రుణం తీసుకోవడానికి వీలుంటుంది.
ఇదిలా ఉండగా జిఎస్‌టి అమలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని నిబంధనలకు శనివారం నాటి సమావేశంలో జిఎస్‌టి కౌన్సిల్ ఆమోదం తెలియజేయడంతో జూలై 1నుంచి జిఎస్‌టి అమలుకు అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నిబంధనలకు సంబంధించి అన్ని విషయాలను చర్చించి ఆమోదించడం జరిగిందని, జూలై 1నుంచి జిఎస్‌టిని అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని సమావేశం అనంతరం కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడున్న రూపంలో తమ ప్రభుత్వం జిఎస్‌టిని అమలు చేయబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇసాక్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా కూడా శనివారం నాటి సమావేశంలో పాల్గొన్నారు కానీ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

జిఎస్‌టి వివరాలను వెల్లడిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
చిత్రంలో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్