జాతీయ వార్తలు

మమ్మల్ని ఎవరూ ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూన్ 4: కేరళలో తమ పార్టీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం నాడు ఇక్కడ ఉద్ఘాటించారు. అధికార సిపి ఎం ఎన్నిరకాలుగా దాడులు జరిపినా, ఎంతగా హింసాకాండ సృష్టించినా రాష్ట్రంలో బిజెపి శక్తివంతం కావటాన్ని ఎవరూ నిరోధించలేరని ఆయన స్పష్టం చేశారు. బిజెపి ఆరెస్సెస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించిన ఆయన ‘‘ ఇవన్నీ ముఖ్యమంత్రి విజయన్ సొంతజిల్లా అయిన కన్నూర్‌లోనే జరగటం సిగ్గుచేటు’’ అని వ్యాఖ్యానించారు.
దాడులు అణచివేత చర్యల ద్వారా బిజెపి ఎదుగుదలను అణచివేయాలని ముఖ్యమంత్రి, ఆయన పార్టీ భావిస్తే వారు పప్పులో కాలేసినట్లేనని అమిత్‌షా అన్నారు. పార్టీ కార్యాలయం కోసం కొత్త భవనం శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన అమిత్‌షా, రాష్ట్రంలో బిజెపి ఆరెస్సెస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం వల్ల తమ కార్యకలాపాలను అనుకున్న స్థాయిలో చేపట్టలేకపోతున్నామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ సిపి ఎం సారథ్యంలో వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ అధికారంలోకి వచ్చినా ఆరెస్సెస్ బిజెపిలకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందన్నారు. ఈ సారి కూడా ఎల్డీ ఎఫ్ అధికారంలోకి రావటం వల్ల వచ్చిందని ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 13మంది ఆరెస్సెస్ బిజెపి కార్యకర్తలు మరణించారన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే జరగటం శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని అమిత్‌షా మండిపడ్డారు. ఈ దాడులకు పాల్పడ్డ వారిని వదిలేది లేదని, చట్టప్రకారం వీరికి తగిన శిక్ష విధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
‘‘రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రాన బిజెపి కార్యకర్తలపై దాడికి పాల్పడ్డవారికి వదిలిపెడతామని అనుకోకండి. ఇందుకు బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షించి తీరుతాం’’ అని అమిత్‌షా ఉద్ఘాటించారు. తాను నేడు చేసిన ఈ శంఖుస్థాపన రాష్ట్రంలో బిజెపి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన శంఖుస్థాపనగానే ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో మరింత ముందుకు దూసుకుపోవటానికి బిజెపి సిద్ధంగా ఉందని, అన్ని వర్గాల మద్దతును పొందే రాష్ట్రంలో ఎల్డీ ఎఫ్, యూడి ఎఫ్‌ల అధికార సంస్కృతికి చరమగీతం పాడుతామని అమిత్‌షా అన్నారు.

తిరువనంతపురంలో ఆదివారం బిజెపి కార్యకర్త ఇంట్లో భోజనం చేస్తున్న అమిత్‌షా