జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థకు పెద్ద మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: దేశ ఆర్థిక వ్యవస్థకు జిఎస్టీ పెద్ద మలుపులాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఉన్నత స్థాయి సమావేశంలో జిఎస్టీ స్థితిగతులను సమీక్షించారు. జూలై 1నుండి జిఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయనుండటం తెలిసిందే. జిఎస్టీ అమలుకు సంబంధించి ఐటి సంసిద్ధత, మానవ వనరుల సంసిద్ధత, శిక్షణ, అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయటం, జిఎస్టీ అమలుపై ప్రజలు వ్యక్తం చేసే అనుమానాలను నివృత్తి చేసేందుకు చేసిన ఏర్పాట్లు, పర్యవేక్షణ గురించి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమీక్షించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జేట్లితోపాటు ఆయన శాఖకు చెందిన సీనియర్ అధికారులు, పిఎంవోకు చెందిన సీనియర్ అధికారులు, కేబినెట్ కార్యదర్శి సమావేశానికి హాజరయ్యారు. జూలై 1నుంచి జిఎస్టీని అమలు చేసే సమయానికి ఐటికి సంబంధించిన వౌలిక సదుపాయాలు, అధికారులకు శిక్షణ, బ్యాంకులతో అనుసంధానం, ప్రస్తుత పన్ను చెల్లింపుదారులను ఎన్‌రోల్ చేయటం వంటి అన్ని పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రధానికి వివరించారు. జిఎస్టీలో సమాచార భద్రత గురించి నేటి సమావేశంలో ప్రత్యేక సమీక్ష జరిపారు. జిఎస్టీపై ప్రజల నుండి ఎదురయ్యే ప్రశ్నలకు బదులిచ్చేందుకు ట్విట్టర్ హ్యాండిల్‌ను ప్రారంభించారు. దీంతోపాటు అఖిల భారత ఉచిత టెలిఫోన్ నంబర్ 18001200232ను కూడా సోమవారం క్రియాత్మకం చేశారు. రాజకీయ పార్టీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు చేసిన కృషి మూలంగానే జిఎస్టీ సాధ్యమైందని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక దేశం- ఒక మార్కెట్- ఒకటే పన్ను విధానం మూలంగా సగటు మనిషికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. జిఎస్టీతో సంబంధం ఉన్న ఐటిలో సైబర్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యభూమికి కట్టుబడి ఉన్నాం
భూగ్రహాన్ని మరింత స్వచ్ఛంగా ఉంచేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోదీ పర్యావరణం పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నవారికి ఆయన జోహారులర్పించారు. ‘‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది ఈ భూమిని కలుషితం లేకుండా, పరిశుభ్రమైన వాతావరణంకోసం పునరంకితం కావడానికి సరైన రోజు. వాతావరణాన్ని పరిరక్షించేందుకు పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలను అభినందిస్తున్నా’’ అని మోదీ సోమవారం ట్వీట్ చేశారు. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భావితరాలకు మన తరం ఆరోగ్యకరమైన భూమిని అందించాల్సి ఉందని ఆయన అన్నారు.