జాతీయ వార్తలు

మరుపురాని రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 5: భారతదేశ చరిత్రలోనే ఇది మరుపురాని రోజని ఇస్రో చైర్మన్ ఎ ఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం జిఎస్‌ఎల్‌వి మార్క్ 3-డి1 విజయం అనంతరం ఆయన శాస్తవ్రేత్తలతో కలసి మీడియా సెంటర్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రయోగంతో ఇస్రో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంలో ఇది తొలి అడుగు మాత్రమేనని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు షార్ నుండి చేపట్టేందుకు ఇది తొలి మెట్టు మాత్రమేనని తెలిపారు. ఇదే తరహా భారీ ప్రయోగాలు మరో రెండు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దశాబ్దాల శాస్తవ్రేత్తల కఠోర శ్రమ ఫలితమే ఈ విజయమని అభివర్ణించారు. ఇంతటి భారీ రాకెట్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక సవాల్‌గా తీసుకొని రూపొందించామన్నారు. తమ శ్రమకు తగిన ఫలితం లభించిందన్నారు. 4టన్నుల ఉపగ్రహాన్ని జియో ట్రాన్సుఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడంతో తొలి అడుగులోనే విజయం సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ నెల 23న పిఎస్‌ఎల్‌వి-సి 38 ప్రయోగం, 28న ఫ్రెంచి గయాన నుండి జీశాట్-17 ఉపగ్రహ ప్రయోగం ఉంటుదన్నారు. వచ్చే ఏడాది సూర్యుని మీదకు ఆదిత్య ఉపగ్రహం, చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇకపై ఏడాదికి 12ప్రయోగాలు చేపడతామన్నారు.
షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ మాట్లాడుతూ భవిష్యత్ ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాస్తవ్రేత్తల సమష్ఠి విజయమని ఇదే స్పూర్తితో మరిన్ని ప్రయోగాలు చేపట్టతామన్నారు. ముఖ్యంగా క్రయోజనిక్ టీమ్ బాగా పనిచేసిందని అందువల్లే ఎటువంటి లోపం తలెత్తకుండా అనుకున్న సమయానికి రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపామన్నారు. ఇస్రో సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ శివన్ మాట్లాడుతూ ఇది 2017లో గొప్ప విజయంగా చెప్పారు. 2014లో క్రయో పరీక్షలు విజయవంతంగా నిర్వహించి తక్కువ సమయంలోనే రూపకల్పన చేసి దిగ్విజయంగా ప్రయోగించడం మన శాస్తవ్రేత్తల పనితనానికి నిదర్శమన్నారు. ఉపగ్రహ డైరెక్టర్ పికె.గుప్తా మాట్లాడుతూ కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఈ ఉపగ్రహంలో 15ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో ఉపగ్రహంలో ఇంధనంగా ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగిస్తామన్నారు. రాకెట్ ప్రయోగంలో క్రయో దశ ముఖ్యమైనదని అది అనుకొన్న పయనంలోనే రాకెట్‌ను చేర్చిందన్నారు. మంగళవారం ఉదయం ఉపగ్రహంలో ఉన్న ఇంధనాన్ని మరోసారి మండించి కక్ష్యను పెంచనున్నట్లు పేర్కొన్నారు. మిషన్ డైరెక్టర్ జి.అయ్యప్పన్ మాట్లాడుతూ శాస్తవ్రేత్తలు 25సంవత్సరాల నిరీక్షణ చేసి రూపొందించిన ఫలితమే ఈ విజయమన్నారు. ఇస్రో శాస్తవ్రేత్తలు, ఉద్యోగులతో పాటు పరిశ్రమలు కూడా బాగా సహకరించాయని ఈ విజయం ప్రతి భారతీయుడిదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇష్టంతో కష్టపడి పనిచేయడంతో అనుకొన్న సమయానికంటే ముందుగానే మార్క్ 3 రాకెట్‌ను రూపకల్పన చేసి షార్ నుండి ప్రయోగించామన్నారు. ఎల్‌పిఎస్‌సి డైరెక్టర్ సోమనాధ్ మాట్లాడుతూ మార్క్ 3 ఇస్రో బాహుబలి ప్రయోగమని దీని విజయం వెనక అందరి కృషి ఉందన్నారు. ఇదే తరహా ప్రయోగాలు చేపట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇకపై భారీ ప్రయోగాలు కూడా షార్ కేంద్రం నుండే జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో శాస్తవ్రేత్తలు తపన్ మిశ్రా, వెంకటకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.