జాతీయ వార్తలు

మార్క్ 3 తన మార్క్‌ను వేసిందిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 5: ఇస్రో శాస్తవ్రేత్తలు జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3-డి1 రాకెట్‌ను మూడు దశల్లో రూపకల్పన చేశారు. దీని బరువు 640టన్నులు, 43.43 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న రాకెట్ ప్రయోగం మూడు దశల్లో జరిగింది. కౌంట్‌డౌన్ 0కు చేరగానే మొదటి దశలో ఉన్న 200టన్నుల ఘన ఇంధనాన్ని ఎస్ 200 బూస్టర్లతో మండించడంతో రాకెట్ పయనం ప్రారంభమైంది. రాకెట్ 41కిమీ ఎత్తులోకి పోయిన అనంతరం 1:54నిమిషాలకు రాకెట్‌లోని రెండో దశలో ఉన్న 110టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి రాకెట్ వేగాన్ని పెంచారు. రాకెట్ 62కి.మీ ఎత్తుకు పోయినంతరం ఎస్ 200 బూస్టర్లు విడిపోయి 2:20నిమిషాలకు తొలి దశను పూర్తిచేసింది. అనంతరం ప్రారంభమై రెండోదశ 3:45నిమిషాలకు 116కిమీ ఎత్తులో అందులో అమర్చిన జియో స్టేషనరీ స్పెక్ట్రోమీటర్ పేలోడ్స్ విడిపోయాయి. అనంతరం ఎల్ 110లిక్విడ్ కోర్ ఇంజిన్ దశ ప్రారంభమై రాకెట్ 169కిమీ ఎత్తులోకి పోయినంతరం 5:22నిమిషాలకు రెండో దశ పూర్తవుతుంది. అనంతరం 25టన్నుల క్రయోజనిక్ ఇంజన్‌తో మూడో దశ ప్రారంభమయ్యి రాకెట్ 174కి.మీ ఎత్తుకు పోయిన అనంతరం 16:05 నిమిషాలకు క్రయోజనిక్ సి 25దశ పూర్తవుతోంది. అనంతర రాకెట్ శిఖర భాగంలో ఉన్న జీశాట్-19 ఉపగ్రహాన్ని 179కి.మీ ఎత్తులో 16:20నిమిషాలకు ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది.
ఉపగ్రహ ఉపయోగాలు
జీశాట్-19 కమ్యూనికేషన్ ఉపగ్రహం బరువు 3,136కిలోలు. ఇది దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విస్తృత సేవలు, ఇంటర్‌నెట్ వేగంగా పనిచేయడమే గాక అధునాతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్ వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తోంది. ఉపగ్రహంలో అమర్చిన కెయూ బ్యాండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్‌తో పాటు జియో స్టేషనరీ రేడియో స్పెక్ట్రోమీటర్ పేలోడ్స్ ఎంతో ఉపయోగం. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందించనుంది. ఇప్పటివరకు ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనదే కాకుండా అధునాతనంగా రూపొందించడంతో ఇంతకు ముందు ప్రయోగించిన ఐదారు ఉపగ్రహాల అందించిన సేవలు ఈ ఉపగ్రహం ఒకటే అందిస్తోంది. ఇందులో అమర్చిన అధునాతన పరిజ్ఞానమే అందుకు కారణం.