జాతీయ వార్తలు

మందసౌర్‌లో సడలని ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందసౌర్, జూన్ 7: పంట రుణాలను మాఫీ చేయాలని, తాము పండించిన పంటల కు మెరుగైన ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో రైతులు చేస్తున్న ఆందోళన మంగళవారం భారీ ఎత్తున హింసాకాండకు దారితీసిన విషయం తెలిసిం దే. మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతోపాటు పోలీసులపై సైతం రాళ్ల వర్షం కురిపించడం లాంటి చర్యలకు పాల్పడ్డం, హింసాకాండలు అయిదుగురు చనిపోవడం తెలిసిందే. కాగా, మందసౌర్ జిల్లాలో బుధవారం కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మంగళవారం పట్టణంలోను, పిపల్యా మండి ప్రాంతంలోను విధించిన కర్ఫ్యూ బుధవారం కూడా కొనసాగుతోంది. మరోవైపు జిల్లా అంతటా 144 సెక్షన్ నిషేధాజ్ఞలు సైతం కొనసాగుతున్నాయి.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనపై కేంద్ర హోం శాఖ రాష్ట్రానికి 1100 మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను పంపించింది. ఇప్పటికే 600 మంది రాఫ్ బలగాలు మందసౌర్‌కు చేరుకున్నాయని, మరో 500 మంది బలగాలను కూడా పంపించడం జరిగిందని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండ గా, మధ్యప్రదేశ్‌లో రైతులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో ఆరోపించారు. దేశంలోనే అత్యంత ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమని, రైతుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. మందసౌర్‌లో జరిగిన సంఘటనలపై దర్యాప్తుకు ప్రధాని ఆదేశించారని, రాష్ట్ర ప్రభుత్వంనుంచి నివేదికను సైతం కేంద్రం కోరిందని వెంకయ్య నాయడు చెప్పారు.
నేడు రాహుల్ పర్యటన
మంగళవారం రైతుల ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసలో చనిపోయిన అయిదుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం జిల్లాకు రావచ్చని తెలుస్తోంది. నిజానికి రాహుల్ గాంధీ ఈ రోజే మందసౌర్‌కు రావలసి ఉండిందని, పొరుగు జిల్లా అయిన నీముచ్‌కు హెలికాప్టర్‌లో రావలసి ఉండగా ఆయన పర్యటన గురువారానికి వాయిదా పడిందని నీముజ్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ చెప్పారు.

మధ్యప్రదేశ్ బంద్ సందర్భంగా బుధవారం దివాస్‌లో రైలును అడ్డుకుంటున్న రైతులు