విశాఖ

వ్యవసాయ అనుబంధ వృత్తులతో రైతు ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 16: వ్యవసాయ అనుబంధ వృత్తులను బాగా ప్రోత్సాహించడం ద్వారా వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేయాలనే గట్టి కృతనిశ్చయంతో రాష్ట్రప్రభుత్వం ఉందని ఆ దిశగా పరిశోధనలు సాగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ వల్లభనేని దామోదరనాయుడు అన్నారు. పరిశోధనా కేంద్రం వైస్‌చాన్సలర్‌గా ఇటీవలే ఆయన బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఇక్కడి ప్రాంతీయ పరిశోధనా కేంద్రానికి విచ్చేసారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం ఈ పరిశోధనా కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడి పరిశోధనా కేంద్రం పనితీరును ఇక్కడ సాధించిన ఫలితాలపైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసి అధ్యయనం చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటల సాగు వలన నష్టాలు సంభవించి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందన్నారు. సాగుఖర్చులు పెరిగిపోవడం వలన, కేవలం వ్యవసాయంపైనే ఆధారపడే పరిస్థితి రైతుకు ఉండటం వలనే నష్టాలను ఎదుర్కొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు సంభవిస్తున్నాయని గుర్తించామన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందిన చోట రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. అనుబంధ రంగాల్లో పాల ఉత్పత్తి అత్యంత కీలకమైందన్నారు. భూసారాన్ని పరిరక్షించడం ద్వారా పంటల దిగుబడిని పెంచడంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇందుకు అనుగుణంగా అనకాపల్లి, కడప, తిరుపతి కేంద్రాల్లో భూసార పరీక్షా కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. శాటిలైట్ ద్వారా భూసారాన్ని తెలుసుకునే ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రపంచంలోనే వరిసాగు అధికంగా ఉన్న పిలిప్పీన్స్‌లో పంటలకు సోకే తెగుళ్లను శాటిలైట్ ద్వారా తెలుసుకునే విధానం అందుబాటులోకి వచ్చిందన్నారు. అక్కడి పరిశోధనా కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నెదర్లాండ్స్‌లో మెగా సీడ్ ప్రాజెక్టు అమలుపై ఏపి ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు మంచి లాభం కలుగుతుందని పాలేకర్ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. ప్రకృతి వ్యవసాయంలో తొలుత దిగుబడులు తగ్గుతాయని, తరువాత క్రమేపీ పెరగవచ్చునన్నారు. జీవామృత ఎరువులు వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై మరింత సమగ్రంగా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. అనకాపల్లి పరిశోధనా కేంద్రం పరిధిలో రైతులకు అవసరమైన చెరకు విత్తనాన్ని మరింత ఎక్కువగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అక్కడ పంటల సాగులో ఆధునీకతను అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. చిరుధాన్యాల సాగును రాష్టవ్య్రాప్తంగానే బాగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు సిఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 320హెక్టార్లలో చిరుధాన్యాల సాగును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
* 16.03కోట్లతో పరిశోధనా కేంద్రంలో మరిన్ని అభివృద్ధి పనులు
అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అభివృద్ధికి నాబార్డు ద్వారా పెద్దమొత్తంలో నిధులు మంజూరయ్యాయని పరిశోధనా కేంద్రం వైస్‌చాన్సలర్ దామోదరనాయుడు తెలిపారు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నాబార్డు ద్వారా 16.03 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 40లక్షలతో మోడ్రన్ సెంట్రల్ రీసెర్చ్ సెంటర్, 75లక్షలతో పరిశోధనా క్షేత్రాల అభివృద్ధి, రెండుకోట్లతో పరిశోధనా కేంద్రాల్లో వౌలిక వసతుల మెరుగు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. రాయలసీమ, ఉత్తరకోస్తా జిల్లాలకు నిధుల కేటాయింపులో తగు సముచిత స్థానం లభించిందన్నారు.
* ఏపిలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం
పశ్చిమగోదావరి జిల్లాలోని విజయరాయిలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి ఒక ప్రత్యేకంగా మొక్కజొన్న పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో తగ్గుతున్న దిగుబడులను అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పరిశోధనా విశ్వవిద్యాలయం పాలకవర్గమండలి తీర్మానం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశోధనా సంచాలకులు ఎన్‌వి నాయుడు, ఇన్‌చార్జి ఎడిఆర్ భరతలక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.