హైదరాబాద్

వర్షాకాలం సేవలకు ఎమర్జెన్సీ బృందాల సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 17: వర్షాకాలంలో తలెత్తే సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు గాను నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సేవల కోసం 140 బృందాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌లోని 150 డివిజన్ల పరిధిలో ఏ ప్రాంతంలో సమస్య వచ్చినా క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక బృం దాలు సేవలు అందించనున్నాయి. మొత్తం 1600మంది కార్మికులను ఈ సేవల కోసం వినియోగించుకోనున్నారు. వర్షాలు లేని సమయంలో మాన్‌సూన్ బృందాలు ఖాళీగా ఉంటున్నట్టు గుర్తించిన అధికారులు వీరి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వర్షం వచ్చినప్పుడు సమస్యల కోసం వినియోగించుకోవడంతో పాటు వర్షాలు పడని రోజుల్లో నాలాల్లో పూడికతీతలు, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, రోడ్లపై పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు వీరి సేవలను ఉపయోగించుకోనున్నారు.

శ్రీ చండీ కుమార అనంత మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు
ఖైరతాబాద్, జూన్ 17: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ భారీ గణపతి ఈ ఏడు శ్రీ చండీ కుమార అనంత మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సుమారు 57 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్న గణపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఏకదంతుని తలపై 15 పాములు, ఓ వైపు చండీదేవి, మరోవైపు కుమారస్వామి ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా విగ్రహానికి కుడివైపు మంచుకొండల్లో తపోదీక్షలో ఉన్న మహాకాళ సదాశివుడు, ఎడమవైపు సింహవాహనంపై మహిషాసురున్ని వధిస్తున్న అమ్మవారి విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ప్రముఖ సిద్ధాంతి గౌరీభట్ల విఠల్ శర్మ సూచనల మేరకు ఈ ఏటి పంచాగాన్ని అనుగుణంగా అనంత మహాగణపతి నమూనాను రూపొందించినట్టు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. ఇప్పటికే గణనాధుడు, ఇతర విగ్రహాలు కొలువుదీరే ప్రాంతాల్లో షెడ్ నిర్మాణ పనులను పూర్తిచేశామని, ఆదివారం నుంచి విగ్రహానికి సంబందించిన వెల్డింగ్ పనులను చేపట్టనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. నమూన చిత్రాన్ని ఎమ్మెల్యే చింతల, కార్పొరేట్ విజయారెడ్డి ఆవిష్కరించారు. భారీ గణనాధుడి నమూన చిత్రాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.