హైదరాబాద్

పెయిడ్ పార్కింగ్ ‘డబుల్’వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: నగరంలోని జిహెచ్‌ఎంసికి చెందిన పెయిడ్ పార్కింగ్‌లలో ఛార్జీలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. జిహెచ్‌ఎంసి పేరిట కాంట్రాక్టర్లు వాహనదారులను నిలువుదోపిడి చేస్తూ, జేబులు నింపుకుంటున్నారు. నాంపల్లి కోర్టు బయటకున్న పార్కింగ్ వ్యవస్ధే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నాంపల్లి క్రిమినల్ కోర్టు బయట ద్విచక్ర వాహనాల నిమిత్తం పెయిడ్ పార్కింగ్ నిర్వహిస్తున్నారు. జిహెచ్‌ఎంసి, కాంట్రాక్టరుకు జరిగిన ఒప్పందం ప్రకారం ఇక్కడ ద్విచక్ర వాహనదారుల నుంచి తొలి రెండు గంటలకు రూ. 5 పార్కింగ్ ఫీజుగా వసూలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత అదనంగా కార్లు వంటి వాహనాలకు అదనపు గంటకు రూ. 5లు, ద్విచక్ర వాహనాలకు అదనపు గంటకు రూ. 3 ఛార్జీలుగా వసూలు చేయాల్సి ఉన్నా, పార్కింగ్ నిర్వాహకులు పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించి వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఇక్కడి నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనదారుల నుంచి తొలి రెండుగంటలకు రూ. 10 ఛార్జీలుగా వసూలు చేస్తున్నారు. పైగా జిహెచ్‌ఎంసి ముద్రించిన రూ. 5 ద్విచక్ర వాహనాల పార్కింగ్ టికెట్లపై రూ. 5ను కొట్టేసి రూ. 10 అని చేతితో రాసి మరీ బలవంతంగా వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు మొదటి రెండు గంటలకు రూ. 5, కార్లు వంటి వాహనాలకు రూ. 10 చెల్లించాలని జిహెచ్‌ఎంసి భారీ సైజులో పెట్టిన బోర్డును చూసిన పలువురు వాహనదారులు దేమిటీ? అని ప్రశ్నిస్తే పార్కింగ్‌లోని ముగ్గురు, నలుగురు నిర్వాహకులు ఒక్కటై వాహనదారులపై దాడికి సిద్ధపడుతున్నట్లు పలువురు వాహనదారులు వాపోయారు. రెండింతలు పార్కింగ్ ఫీజు వసూలు చేయటంపై పలువురు వాహనదారులు నిలదీయగా, తామూ అధికారులకు ఇచ్చుకోవాలి కదా! అంటూ నిర్వాహకులు సమాధానం చెబుతున్నారు.
పారదర్శకత ఎక్కడ?
ఈ పార్కింగ్ స్థలంలో వాహనదారులకేమైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలుంటే కాంట్రాక్టర్, స్థానిక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయవచ్చునని బోర్డు ఉన్నా, ఇందులో రాసిన ఫోన్ నెంబర్లు జిహెచ్‌ఎంసి పారదర్శకతకు ప్రశ్నార్థకంగా మారాయి. కాంట్రాక్టర్ నెంబర్‌కు ఫోన్ చేయగా, ఎలాంటి స్పందన లేదు. ఇక జిహెచ్‌ఎంసి కాల్ సెంటర్ నెంబర్ 24111111ను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నెంబర్‌గా పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్లకు జిహెచ్‌ఎంసి కేటాయించిన సెల్ నెంబర్ ఈ బోర్డులో పెట్టకపోవటం అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్‌కు నిదర్శనమన్న వాదనలున్నాయి.