వరంగల్

ప్రతి వ్యక్తిలో ఉండేది పరమాత్మ చైతన్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ (కల్చరల్), జూన్ 22: మానవాళిని సృష్టించింది పరమాత్ముడేనని, ప్రతి మనిషిలో ఉండేది పరమాత్మ చైతన్యమేనని విద్యానంద భారతీస్వామి అన్నారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న సహస్ర చండీ యాగంలో గురువారం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ ప్రభుత్వంలో శాఖలు ఉండి ఏవిధంగా ఐక్యతతో పనిచేస్తుందో వర్ణ వ్యవస్థలో కులాలు కూడా అదేవిధంగా ఐక్యంగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడాయని, భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న చండీ హోమంలో అన్ని వర్గాల వారు పాల్గొని యాగానికి సహకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సనాతన ధర్మానికి నాలుగు స్థంభాలు ఉంటాయని, చాతువర్ణ వ్యవస్థ అనే నాలుగు స్థంభాలపై సనాతన ధర్మం అనే కప్పు నిలబడి ఉందని, సనాతన ధర్మం పై ఎంతో మంది విదేశీయులు దాడులు జరిపినప్పటికీ సనాతన ధర్మం చెక్కుచెదరకుండా తనను తాను రక్షించుకొని లోక రక్షణకు హేతువవుతోందని, అన్ని వర్ణాల వారిలో ఉండేది ఆ పరమాత్మ చైతన్యమేనని చెప్పారు. యాదేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితా అని చండీ సప్తశతి చెబుతోందని, ఎవరికి వారు తమ కులంలో పుట్టినందుకు గర్వించాలని అదే సనాతన ధర్మం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమనేది సనాతన ధర్మమేనని అన్నారు. ప్రయోగాత్మకంగా సాధిస్తూ భారత దేశ సమగ్రతను కాపాడుతుందని అన్నారు. ఈ నాలుగు వర్ణాలు ఐక్యతతో ఉండటం వలననే సనాతన ధర్మం ప్రజ్వలిస్తుందని సనాతన ధర్మం గురించి వివరించారు.
యాగానికని విచ్చేసిన ఆయనను దేవాలయ ఈవో సునిత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో జరుగుతున్న సహస్ర చండీ యాగంలలో భాగంగా ఋగ్వేత పండితులు నరేంద్ర కాప్రే నేతృత్వంలో వంద మంది ఋత్వికులు నాలుగవ రోజు చండి యాగ పురశ్చర నవార్ణవ జపాన్ని పూర్తి చేశారు. పదకొండు మంది ఋత్వికులు యాగశాలలో రుద్రహోమ పురశ్చరనను సంపూర్ణం చేశారు. అదే విధంగా యాగ శాలలో చతుర్వేద హోమాలు, చతుర్వేద ఉప శాఖల హోమాలను జరిపారు. ఈ సందర్భంగా యాగాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంతే కాకుండా వందలాదిగా మహిళలు సామూహిక లలితా సహస్రనామ పురసృత కుంకుమార్చనలు జరిపారు.
వేద వేదాంత పండితులు వేదఘోష నిర్వహిస్తుండగా ఆలయానికి వచ్చిన భక్తులు పరవశించి పోయారు. నాలుగవ రోజు కార్యక్రమాలలో ప్రముఖులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, టిఎన్‌జిఓ యూనియన్ ప్రెసిడెంట్ కారం రవీందర్ రెడ్డి, పరిటాల సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ యం రాజేందర్, ఉపేందర్ రెడ్డి, టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షులు కోలా రాజేష్‌కుమార్, కేవీ చారి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.