హైదరాబాద్

కళలకు నిలయం గానసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జూన్ 25: కళా సంస్థలను ప్రొత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళాలలిత కళావేదిక ఆధునీకరణ అనంతరం ఆదివారం ఆయన ప్రారభించారు. శ్రీత్యాగరాయ గానసభ కళలకు నిలయమన్నారు. ఉచితంగా కళ వేదికలను ఇచ్చి సంస్థలను ప్రోత్సహించడం ఎంతో సంతోషనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి రమణచారి మాట్లాడుతూ కళ రంగాన్ని కాపాడడం కోసం గానసభ చేస్తున్న ప్రయత్నలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తు గానసభ అభివృద్ధికి కృషి చేస్తున్న కళాసుబ్బారావు కుంటుంబ సభ్యులను అభినందించారు. సభకు ముందు వర్ధమాన గాయనీ మళవిక ఆనంద్‌చే అలపించిన శ్రీత్యాగరాయ సంగీత విభావరి అందరిని అలరించాయి. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి పాల్గొన్నారు.