హైదరాబాద్

మియాపూర్‌లో ముగ్గురు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 17: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు అదృశ్యమయ్యారు. వీరిలో ఒక బాలుడు, ఓ మహిళ, మరో యువకుడు ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ చీమర్ల హరిశ్చంద్రారెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. న్యూ హఫీజ్‌పేటలోని ఆదిత్యనగర్‌లో నివసిస్తున్న డ్రైవర్ సయ్యద్ నాసిర్ షా మూడేళ్ళ కొడుకు సయ్యద్ షోయబ్ తప్పిపోయాడు. శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు.
అన్నిచోట్లా వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేయగా ఎస్‌ఐ కె.లింగ్యా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, జనప్రియ అపార్టుమెంట్స్‌లోని 5వ ఫేజ్‌లో ఫ్లాట్ నెంబర్ ఎ2/318లో ఉంటున్న ఉపాధ్యాయుడు కె.సూర్యనారాయణ భార్య సుందరీ దేవి అలియాస్ మణి (57) ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. తన భార్య కనిపించడం లేదని ఆదివారం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఎఎస్‌ఐ అమృత దర్యాప్తు చేస్తున్నారు. న్యూ హఫీజ్‌పేటలోని ప్రేంనగర్‌లో నివసిస్తున్న జి.దయానంద్ (23) కొండాపూర్‌లోని పరాటా రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 10వ తేదీన బట్టలు, సర్ట్ఫికెట్లు తీసుకుని తన బైక్‌పై వెళ్ళిపోయి తిరిగి రాలేదు. తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి కేసు నమోదు చేయగా ఎస్‌ఐ కె.లింగ్యా దర్యాప్తు చేస్తున్నారు.