జాతీయ వార్తలు

చట్ట సవరణ అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: గోసంరక్షణ పేరిట దేశవ్యాప్తంగా సాగుతోన్న హత్యల వ్యవహారం బుధవారం రాజ్యసభను కుదిపేసింది. ఈ రకమైన దాడులను అరికట్టే అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయని స్పష్టం చేసిన కేంద్రం, ప్రస్తుత చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదని చెప్పడంలో విపక్షాలు గగ్గోలెత్తాయి. ప్రభుత్వ సమాధానంతో ఏకీభవించని సమాజ్‌వాదీ సభ్యులు, ఇతర ప్రతిపక్షాలు సభమధ్యకు వెళ్లి నినాదాలు చేశాయి. గో సంరక్షణ సాగిస్తున్న హత్యలను ఆపాలన్న ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదని ధ్వజమెత్తిన విపక్షాలు అలజడి సృష్టించటంతో ప్రశ్నోత్తరాల సమయంలో సభ పది నిమిషాలు వాయిదాపడింది. సభ్యులు ప్రశ్నలు వేయడానికి వీలు కల్పించాలని చైర్మన్ అన్సారీ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారాం అహిర్ ‘గో సంరక్షణ పేరిట అరాచకాలకు పాల్పడిన వారిని అదుపుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది’ అని స్పష్టం చేశారు. ఈ రకమైన సామూహిక హత్యల వెనుక బిజెపి కార్యకర్తల ప్రమేయం ఉందంటూ సమాజ్‌వాదీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ చేసిన ఆరోపణలను తిరస్కరించారు. ఈ రకమైన సంఘటనలు వెలుగులోకి వచ్చినపుడు వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఇప్పటికే కోరామని గంగారాం తెలిపారు. గోరక్షణ పేరుతో దాడులు సాగించేవాళ్లను సహించకూడదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సైతం రాష్ట్రాలను కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రస్తుత చట్టంలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని చెప్పారు. గోసంరక్షణ పేరుతో సాగుతోన్న హింసాకాండను అరికట్టేందుకు ప్రస్తుత చట్టాన్ని సవరిస్తారా? అని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ వేసిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానం అలజడికి దారితీసింది. దేశంలోని 24 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలు గోవధను నిషేధించాయని, అరుణాచల్, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ వంటి రాష్ట్రాలే దీన్ని నిషేధించలేదని, అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షదీవుల్లో కూడా నిషేధం లేదని తెలిపారు. ఇప్పటివరకూ జాతీయ నేర రికార్డుల బ్యూరో మతపరమైన దాడుల్లో జరిగే హత్యాకాండ కేసులనే రికార్డు చేసేదని, 2014 నుంచి సామూహిక హత్యాకాండలకు సంబంధించిన వివరాలను కూడా నమోదు చేస్తోందని మంత్రి తెలిపారు. 2014లో కేరళ, కర్నాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, యుపీల్లోనే ఈ సామూహిక హత్యాకాండలు జరిగాయని, 2015లో ఈరకమైన సంఘటనలు యూపీ, తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, రాజస్థాన్‌లో కూడా నమోదయ్యాయని వెల్లడించారు.