జాతీయ వార్తలు

హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ హిందూ దేవతలపై చేసిన వాఖ్యలు రాజ్యసభను కుదిపేయడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. రాజ్యసభలో అగర్వాల్ మాట్లాడుతూ హిందూ దేవతలను మద్యం బ్రాండ్లతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. అగర్వాల్ వ్యాఖ్యలపై సభలో ఉన్న కేంద్రమంత్రులు, బిజెపి ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసభాపతి పిజె కురియన్ జోక్యం చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రికార్డుల నుంచి తొలగిస్తామని బిజెపి ఎంపీలకు సూచించారు. ఈ పరిస్థితులలో ఈ వ్యాఖ్యలను అగర్వాల్ వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుని అగర్వాల్ హిందూ దేవతలను మద్యం బ్రాండ్లతో పోల్చారని, ఇదే పార్లమెంట్‌లో కాకుండా బయట మాట్లాడితే కోర్టులో కేసును ఎదుర్కొనేవారని అన్నారు. ఈ దశలో ఎంపీ నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ తాను ఏదైన కించపరిచేలా మాట్లాడి ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని ఉపసభాపతిని కోరారు. అయినాకూడా బిజెపి సభ్యులు సభను అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మన్ సభను పది నిమిషాలు వాయిదా వేసి వెళ్లిపోయారు. మరోసారి సభ ప్రారంభ కాగానే నరేశ్ అగర్వాల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో అగర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకుంటున్నట్టు సభలో వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ అనంద్ శర్మ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంపీ సీతారాం ఏచూరి మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై నరేశ్ అగర్వాల్ క్షమాపణలు కోరినందున సభ కొనసాగించాలని కోరారు.