జాతీయ వార్తలు

నితీశ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 26: బీహార్ రాజకీయాలు బుధవారం నాటకీయ పరిణామాలతో అట్టుడికాయి. ఆర్జేడీతో తలెత్తిన విభేదాలు పరాకాష్టకు చేరడంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తన పదవికి అనూహ్యరీతిలో రాజీనామా చేశారు. ఆర్జేడీతో గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేధాలకు తెరదించుతూ తెగతెంపులకు సిద్ధమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఉప మఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామాకు సంబంధించి తలెత్తిన వివాదం నితీశ్ సంచలన నిర్ణయానికి దారి తీసింది. అధికారంలో మిత్రపక్షమైన ఆర్జేడీతో తలెత్తిన విభేదాలు భరించలేని స్థాయికి చేరుకున్నాయంటూ ప్రకటించిన నితీశ్‌కుమార్, గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలుసుకుని రాజీనామా లేఖ అందించారు. అంతకుముందు లాలూప్రసాద్‌తో ఆయన జరిగిన చర్చలు విఫలం కావడం, తన కుమారుడి ఉధ్వాసనకు ఆయన ఎంతమాత్రం అంగకీరించకపోవడంతో నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది చోటుచేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ నితీశ్‌కుమార్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా జెడి(యు) ఎన్నుకుంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీశ్‌కు మద్దతిస్తామంటూ బిజెపి ముందుకొచ్చింది. అందుకు సంబంధించి గవర్నర్‌కు లేఖ కూడా అందించింది. రాత్రి పొద్దుపోయిన తరువాత గవర్నర్‌ను కలుసుకున్న రాష్ట్ర బిజెపి నాయకుడు నిత్యానంద్ రాయ్ తాము నితీశ్‌కు మద్దతిస్తున్నట్టుగా లేఖను అందించారు. మరోపక్క జెడి (యు) పక్ష నాయకులు కూడా గవర్నర్‌ను కలుసుకుని మళ్లీ నితీశ్‌కుమార్‌నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు పావులు కదపడం మొదలుపెట్టారు. తాజా సంకేతాలను బట్టి గురువారంనాడే నితీశ్ మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించిన అనంతరం రాజ్‌భవన్ వెలుపల మీడియాతో మాట్లాడిన నితీశ్‌కుమార్ ‘బీహార్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్టపరిస్థితుల నేపథ్యంలో ఈ మహాకూటమి ప్రభుత్వాన్ని నడపడం అన్నది ఎంతమాత్రం సాధ్యం కాదు’ అని స్పష్టం చేశారు. బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నకు ‘రాష్ట్ర ప్రయోజనాలకు ఏది అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటాను. భవిష్యత్ పరిణామాల కోసం వేచి ఉండండి. ఇప్పటి వరకూ జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక జరగబోయేదే ముఖ్యం’ అన్నారు. తన రాజనామాను గవర్నర్ ఆమోదించారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకూ పదవిలో కొనసాగాలని కోరినట్టు తెలిపారు. ఆర్జేడీతో తలెత్తిన విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకే ప్రయత్నించానని వివరించిన నితీశ్ ‘నేను ఎవరి రాజీనామాను కోరలేదు. అవినీతి ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలనే తేజస్విని అడిగాను’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి బిజెపి మద్దతు స్వీకరించే విషయంలోనూ ఆయన విముఖతను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఎప్పుడైతే నితీశ్ రాజీనామా చేయడం, ఆయన తదుపరి వ్యూహానికి సంబంధించి సంకేతాలు అందాయో మళ్లీ జెడి(యు)తో దోస్తీని పునరుద్దరించుకునేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం ఎంతమాత్రం ఆలస్యం లేకుండా రంగంలోకి దిగింది. అదే సమయంలో ప్రధాని మోదీ కూడా అవినీతికి వ్యతిరేకంగా నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ‘అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మీరు చేతులు కలిపినందుకు, మీ నిజాయితీని యావత్ భారతావని శ్లాఘిస్తోంది’ అని పేర్కొన్నారు. దానికి వెంటనే స్పందించిన నితీశ్ ‘నా నిర్ణయాన్ని బలపర్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. ఎప్పుడైతే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారో దాన్ని మళ్లీ జెడి (యు)తో బిజెపి చేతులు కలపడానికి సంకేతంగా ప్రచారం జరిగింది. 2013లో పదిహేడేళ్ల రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకుని బిజెపి నుంచి జెడి(యు) విడిపోయింది. అందుకు ప్రధాన కారణం.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని బిజెపి ప్రచార కమిటీ సారథిగా నియమించడమే.
రాష్ట్రంలో బిజెపి, జెడి(యు) కూటమి ప్రభుత్వం పని చేసినపుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత బిజెపి నేత సుశీల్‌కుమార్ మోది తాజా పరిణామాలపై స్పందిస్తూ ‘కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జెడి (యు) అధినేతకు మద్దతిస్తాం. అందులో చేరేందుకూ అభ్యంతరం లేదు’ అన్నారు. నితీశ్‌నే తమ నాయకుడిగా ఎన్నుకుంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, జెడి (యు) సమావేశం కానున్నాయని కూడా ఆయన వెల్లడించారు. 243 స్థానాలు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో జెడి (యు)కి 71మంది, బిజెపికి 53మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఉమ్మడి బలం 124. అసెంబ్లీలో మొత్తం స్థానాల్లో సగంకంటే ఎక్కువ. అలాగే ఈ కూటమికి ఎన్డీయే మిత్రపక్షాలైన ఎల్‌జెపి (2), ఆర్‌ఎల్‌ఎస్‌పి (2) మద్దతు కూడా ఉంది.