జాతీయ వార్తలు

వీడియో తీశారో.. జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన తెలియజేస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన బిజెపి సభ్యుడు అనురాగ్ ఠాకూర్ బుధవారం క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే క్షమించేది లేదంటూ స్పీకర్ ఆయనను గట్టిగా హెచ్చరించారు. ఈ నెల 24న వెల్ లోపల తమ నిరసన ప్రదర్శనలను ఠాకూర్ వీడియో తీయడంపై కొంతమంది ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు భగవంత్ మాన్ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు కూడా. అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని స్పీకర్ అంటూ ఎవరైనా ఇలాంటి పని చేసి ఉంటే దాన్ని ఖండించి తీరాలని అన్నారు. అంతేకాదు ‘మీరు ఒకవేళ వీడియో తీసి ఉంటే సభకు క్షమాపణ చెప్పండి’ అని ఠాకూర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో ఆయన తాను చేసిన పనికి చింతిస్తున్నానంటూ సభకు క్షమాపణ చెప్పారు. అనంతరం ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుమిత్రా మహాజన్, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి పని చేస్తే క్షమించేది లేదంటూ గట్టి హెచ్చరిక చేశారు.
ఈ నెల 24న కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో గొడవ చేయడం, కాగితాలు చించి స్పీకర్‌పైకి విసిరేసినందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ అయిదు రోజుల పాటు సస్పెండ్ చేయడం తెలిసిందే. వెల్‌లో కాంగ్రెస్ సభ్యులు గొడవ చేస్త్తున్న సమయంలో అనురాగ్ ఠాకూర్ తన మొబైల్ ఫోన్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. కాగా, అదేరోజు సభ వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ పార్లమెంటు వెలుపల వీడియో తీసినందుకు ఆయనను రెండు సమావేశాలకు సస్పెండ్ చేసినప్పుడు పార్లమెంటు లోపల వీడియో తీసిన ఠాకూర్‌పై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు.