సాహితి

మొదటి జాతి వాచకం ‘ఆంధ్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్నయకు పూర్వం తెలుగులో సాహిత్యమున్నదని అది జైన సాహిత్యమని మొదటిసారిగా ‘ప్రబంధ రత్నావళి’ అనే గ్రంథంలో వేటూరి ప్రభాకర శాస్ర్తీగారు ప్రకటించారు. అలాగే 15 శతాబ్దికి చెందిన అమరావతి స్తూపంలో ‘నాగబు’ అను శబ్దం ఉన్నదనీ దానిలో ‘బు’ అనునది అమహద్వాచక ప్రధానమైన వచన ప్రత్యాయమైన ‘ము’ వర్ణమునకు రూపాంతరమని అదే తొలి తెలుగు మాట అని వేటూరి ప్రభాకర శాస్ర్తీ అభిప్రాయపడ్డారు. నన్నయ్యకు పూర్వం తెలుగు భాషలోగల సాహిత్య మరియు భాషా సంబంధ విశేషాలను చాలావరకు పరిశోధించి తెలుగు జాతికి అందించిన ఘనుడు వేటూరి ప్రభాకరశాస్ర్తీ.
నన్నయ భారతమే తెలుగులో మొదటి కావ్య రచన అనే అభిప్రాయం సాధారణంగా. ఒకసారి ఆలోచన చేస్తే- ఎటువంటి ప్రతిభాశాలి అయినా పరిపక్వమైన భాషాస్వరూపాన్ని ఎన్ని వందల ఏండ్లనుంచో పుట్టి పెరుగుతూ వచ్చి ఉండాలి. ఆ అజ్ఞాత యుగం గురించి కొంతైనా తెలిసిన వారి సంఖ్య అతి స్వల్పం అన్నారు డా. సి.వి.రాజమన్నారు ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆరవ సంపుటం - తొలి రాయల యుగం ప్రవేశికలో.
నన్నయ్య తన గ్రంథమున సమకాలము వారిని గాని పూర్వ కవులను గాని పేర్కొనలేదు. నన్నయ్యకు పూర్వం ఒకటవ శతాబ్ది నుంచి పద్య రచన కలదు. తెలుగు పేరు నన్నయ్యే వాడినాడు.
వేటూరి ప్రభాకర శాస్ర్తీగారి కొన్ని వ్యాసాలను అధ్యయనం చేసినట్లయితే నన్నయ్యకు పూర్వం ఆంధ్ర వాఙ్మయాకుల, నన్నయ్యకు పూర్వం ఆంధ్ర భాష గురించి అనే విషయములు విదితమవుతాయ. తెలుగున గేయరచన నాల్గవ శతాబ్ది నుండి ప్రారంభమయినట్లు వేటూరి ప్రభాకర శాస్ర్తీ ఉపన్యాసములను చదివి తెలుసుకున్నది. నన్నయ్య తెలుగు పదమును తొలుత ప్రయోగించినవాడు. పూర్వమీ తెలుగు పదములు దొరకలేదు. ‘తెల్లింగాధిపతెః’ అని నన్నయ్య శాసనములలో ప్రయుక్తము. నాటక ప్రకరణములో ఆ శ్లోకమును శ్రీ శాస్ర్తీగారు ‘పక్షేత్రేందరుడు’ ఇత్యాదిగా తెనుగించారు. ‘త్రిలింగ’ పదమునుండి తెలుగు పుట్టిందని, ‘త్రినగ’ పదమునుండి తెనుగు పుట్టిందని ఏది నిజమో ఇతమిద్ధంగా చెప్పలేమని శ్రీ తిమ్మావజ్జుల కోదండరామయ్యగారు శ్రీ శాస్ర్తీగారి ఉపన్యాసముల ద్వారా గ్రహించిన విషయములను తెలియజేశారు.
నన్నయ్యకు 150 ఏళ్ళకు పూర్వం ‘బాదప శాసనము ధవళ గుణో ధవళ యశో అని శ్లోకము యతిప్రసాలతో ఉండేది.
నన్నయ్యకు పూర్వం తూర్పు, పడమరలకు దేశీ పదములున్నవి. సూర్యాస్తమయములే ముఖ్యము కాబట్టి ఆ రెండింటికే పదములు ఏర్పడినవి. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, లోపల, వెలుపల అను పదములు మాత్రమే కాలవు. తిర్యక్‌లోనుండే తెర్క్ అను పదము వచ్చి ఉంటుంది. ఉత్తర దక్షిణములకు తెలుగు, కన్నడ, ద్రావిడ భాషలలో దేశీ పదములు లేవు. ‘లెం’ శబ్దమే ‘తెన్’ అనునది. ‘తెన్’ అనునది దక్షిణమునకు అర్థము. నన్నయ్యకు పూర్వం శాసనములలో సీసములు తరువోజలు కలవు. నన్నయ్యకు పూర్వం 200 సంవత్సరాలకే కన్నడ కావ్యములేర్పడినవి. చంపకమాల, ఉత్పలమాల కర్ణాతకములో విశేషముగా కలవు.
నన్నయ్య భట్టారకుడు తెనుగు పదమును తొలుత ప్రయోగించాడని వేటూరి ప్రభాకర శాస్ర్తీగారు తన ఉపన్యాసములలో పేర్కొన్నారు. నన్నయ్య తన గ్రంథమున సమకాలిన వారిని గాని, పూర్వ కవులను గాని పేర్కొనలేదు.
నన్నయ్యకు పూర్వము ఆంధ్ర కావ్యములు కనపడవు. అంతకుముందు ఒక శతాబ్దం ముందుదాకా శాసనాల్లో పద్యాలూ కనపడతాయి. అంతకు ఐదు శతాబ్దాల వరకూ ఓ శతాబ్దం ముందుదాకా శాసనాల్లో వచన రచన కనపడుతున్నది. దానికి పూర్వం ఆంధ్ర భాష కనపడదు. కాని ప్రాకృత పాళీ భాష శాసనాలందు తెలుగు సంజ్ఞా వాచకాలను గుర్తించవచ్చు. ‘ఆంధ్ర’ అనే పదం మొదటి జాతి వాచకం. ఆ తరువాత వారు నివసించే జాతి వాచకం. ఆ తరువాత జాతి మాట్లాడే భాషగా రూపాంతరం చెందింది.

- బులుసు సరోజినీదేవి, 9866190548